balayya remake movies :నందమూరి నటసింహం బాలక్రిష్ణ తీసే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయనకు తెలుగు నాట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తీసిన సినిమాలు ఎక్కువగా హీరో ఓరియంటెడే. ఇలా బాలయ్య తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. బాలయ్య నటించిన అఖండ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇలా ఆయన అనేక రిమేక్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. బాలక్రిష్ణ నటించిన రిమేక్ సినిమాల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే…
balayya remake movies
ఒకప్పుడు రిమేక్ సినిమాలంటే పెద్ద హీరోలు వెనుకడుగు వేసేవారు. కానీ బాలయ్య మాత్రం చాలా డేర్ గా సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పించాడు. నర్తనశాల బాలక్రిష్ణ తండ్రి అయిన ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా నర్తన శాలను ఆయన రిమేక్ చేశారు. ఈ సినిమా హీరోయిన్ సౌందర్య చనిపోవడంతో ఆమె ఉన్నంత వరకు షూట్ చేసిన 17 నిమిషాల పార్ట్ ను గతేడాది ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపెట్టిన లయన్ సినిమా కూడా రిమేకే. ఈ సినిమాలో బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాను హాలీవుడ్ సినిమా టోటల్ రీకాల్ నుంచి రిమేక్ చేశారు. కానీ ఈ సినిమాను రిమేక్ కంటే ఎక్కువగా ప్రీ మేక్ అని చెప్పొచ్చు. పాండురంగడు మూవీ కూడా రిమేకే. స్నేహ హీరోయిన్ గా బాలయ్య, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తీసిన ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన పాండురంగ మహత్యం అనే సినిమాకు రిమేక్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
balayya remake movies
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు సినిమాను కూడా భారతీయుడు సినిమా నుంచి తీసుకుని రిమేక్ చేశారు. కానీ ఈ సినిమాను రిమేక్ అని చెప్పలేం. ఈ సినిమా భారతీయుడు సినమాకు ప్రీమేక్. అయినా కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయేంద్రవర్మ సినమా హాలీవుడ్ మూవీలు ది బౌర్నే ఐడెంటిటీ, మరియు ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనే సినిమాలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాను రిమేక్ అనే కన్నా ప్రీ మేక్ అని చెప్పొచ్చు. అయినా కానీ ఈ సినిమా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన లక్ష్మీనరసింహ మూవీ కూడా రిమేకే. తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన సామి సినిమాకు ఇది రిమేక్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మతాబులా పేలింది.
balayya remake movies