Bichagadu 2 Movie Review : బిచ్చగాడు-1 మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అందుకుందో మనం చూశాం. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దెబ్బకు విజయ్ ఆంథోనీ పేరు మార్మోగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ రివ్యూను చేశారు. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇందులో విజయ్ గురుమూర్తి, సత్య అనే రెండు పాత్రల్లో నటించాడు విజయ్. విజయ్ గురుమూర్తి దేశంలోనే 7వ రిచెస్ట్ పర్సన్. ఇక సత్య ఒక బిచ్చగాడు. కాగా విజయ్ గురుమూర్తి ప్లేస్ లోకి సత్యను పంపించాల్సి వస్తుంది. మరి గురుమూర్తి ప్లేస్ లోకి సత్యను ఎందుకు పంపిస్తారు.. అసలు గురుమూర్తికి ఏమవుతుంది, సత్య ఏం చేస్తాడు అనేది మిగతా కథ.
ఎవరెలా నటించారంటే..
విజయ్ ఇందులో రెండు పాత్రల్లో మెప్పించాడు. బిలియనీర్ గా.. అదే సమయంలో ఒక బిచ్చగాడిగా అదరగొట్టేశాడు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆయన తేలిపోయారనే చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో కూడా ఇంకాస్త బెటర్ గా నటించాల్సి ఉండేది. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పెద్దగా చెప్పుకునే విధంగా నటించలేదు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు తెరమీదకు వచ్చాయి. రొటీన్ కథను ఎంచుకున్నప్పుడు.. అందులోని సీన్లను చాలా కొత్తగా చూపించాలి. డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉండాలి. కానీ సీన్లలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. స్క్రీన్ ప్లే కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఫస్ట్ హాఫ్ లో సాగింది. ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో ఆకట్టుకోలేకపోయింది. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. డబ్బింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్..
ఫస్ట్ హాఫ్ సీన్స్
నేపథ్య సంగీతం
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్..
క్లైమాక్స్,
స్లో కథనం,
సెకండ్ హాఫ్
చివరగా..
బిచ్చగాడు-2 మూవీలో కొత్తదనం ఏమీ లేదు. మొదటి సినిమాలో కంటెంట్ హీరో. కానీ సెకండ్ దాంట్లో మాత్రం కొన్ని అనవసర సీన్లతో నింపేశారు. రొటీన్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ కంటెంట్, సీన్లు, డైలాగులు ఏమీ పెద్దగా లేవనే చెప్పుకోవాలి.
రేటింగ్ : 2.25/5
Read Also : Ram Gopal Varma : పవన్ కల్యాణ్ ఒక దద్దమ్మ.. ఆర్జీవీ సంచలన విమర్శలు..!
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు వల్లే పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా..?