Big Boss-5 Episode 67 : బిగ్‌బాస్ 5 సీజన్ 67 ఎపిసోడ్ చాలా వరస్ట్‌గా సాగిందని చెప్పవచ్చు. హౌస్‌లో కేకు ముక్క పెట్టగా దానికి సన్నీ వచ్చి తినేశాడు. నేను కెప్టెన్ దానిని తినే అర్హత నాకు మాత్రమే ఉందంటూ ఆనీ మాస్టర్ ఏడ్చేసింది. ఆ తర్వాత సన్నీతో గొడవ పెట్టుకుంది. వీరి కోట్లాటను చూస్తే చిన్న పిల్లల గొడవే బెటర్ రా బాబు అనిపిస్తుంది.
బిగ్‌బాస్ ఏందీ కేకు గోలా..?
హౌస్‌లో కేకు ముక్క పెట్టిన బిగ్ బాస్ దీనికి తినే అర్హత ఎవరికీ ఉందని నోట్ పెడతాడు. అయితే, దానిని తినడానికి అందరూ ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోతారు. ఆనీ మాస్టర్ నేనే ఇప్పుడు కెప్టెన్. దానిని తినే అర్హత నాకే ఉందటూ సన్నీతో వాదనకు దిగుతుంది.
దీంతో సన్నీ మీరు తింటే తినేయండి అంటాడు. కానీ ఆనీ మాస్టర్ ధైర్యం చేయలేదు. చివరకు మీరు తినకపోతే నేను తినేస్తా అంటాడు సన్నీ.. అయితే, సీక్రెట్ రూంలో ఉన్న జెస్సీ అభిప్రాయం కోరతాడు బిగ్ బాస్.. ఈ కేకు తినే అర్హత ఎవరికి ఉందని అడుగగా రవికి ఉందని అంటాడు జస్వంత్.
Big Boss-5 Episode 67-2
కేకును లాగించేసిన సన్నీ.. నాకు కావాలని ఏడ్చిన ఆనీ మాస్టర్
కేకు తినడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉదయాన్నే సన్నీ వెళ్ళి దానిని తినేశాడు. కరిగిపోతుందని తినేశా బిగ్ బాస్ అంటూ కవరింగ్ ఇచ్చాడు.ఆనీ మాస్టర్ ఇంతలో బయటకు వచ్చి కేకు లేకపోవడాన్ని చూసి నానా రభస చేస్తుంది. నేను కెప్టెన్.. నా మాట వినవా నువ్వు.. రేపు నువ్వు కెప్టెన్ అయితే ఇలానే చేస్తావా అంటూ సన్నీని నానా మాటలు అంటుంది ఆనీ మాస్టర్.
ఈసారి కూడా సభ్యులకు బీబీ హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ సిబ్బంది అయితే.. ఆనీ మాస్టర్ మేనేజర్.. రవి హౌస్ కీపింగ్.. మానస్, ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన కొత్త జంట.. కాజల్ మాత్రం హోటల్ యాజమానికి ఫ్రెండ్.. సన్నీ తొలిసారి హోటల్‌కు వచ్చిన అతిథి.. సిరి ఓ డాన్ కూతురుగా యాక్ట్ చేస్తుంది. ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బీబీ హోటల్ టాస్క్ ఇచ్చామని బిగ్ బాస్ చెబుతాడు. రవికి మాత్రం సీక్రెట్ టాస్క్ ఇచ్చి అందరి పనులను చెడగొట్టాలని చెబుతాడు. సీక్రెట్స్ లీకైతే మాత్రం వారు కెప్టెన్ పోటీదారుల నుంచి తప్పుకోవాలని చెప్తాడు బిగ్ బాస్..