big boss-5 Episode 68 : సభ్యులకు బిగ్‌బాస్ బీబీ హోటల్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా సిరి షణ్ముక్ తో కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది. తన గ్లామర్ గురించి ఫీల్ అవుతుంటే షణ్ముక్ ఒక్కసారిగా బాంబ్ పేలుస్తాడు. దీంతో సిరి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
సిరి నువ్వు జస్ట్ యావరేజ్ అంతే..
షణ్ముఖ్ అంటే ఎందుకు అందరూ ఇష్టపడుతారో ఒక్క ఉదాహరణతో తెలిసిపోతుంది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తుంటాడు అందుకే కాబోలు అనుకుంటున్నారు ఫాలోవర్స్. బిగ్ బాస్ హౌస్‌లో ‘బీబీ హోటల్’టాస్క్ జరుగుతున్న సమయంలో ‘సిరి’హోటల్ అతిథిగా వస్తుంది. ‘షణ్ముఖ్’ ఆమె సర్వెంట్ గా యాక్ట్ చేయాలి. ఈ కారణంతో సిరి షన్నూతో అన్ని పనులు చేయించుకుంటుంది. వెల్ కమ్ డ్రింక్‌ను తాగించాలని కోరుతుంది. అందులో కొంచెం ఒలికి ఆమె కాలి పైభాగంలో పడటంతో షణ్ముఖ్ కావాలని తొడ భాగంలో ముట్టుకుని తెగ తుడిచేస్తాడు. అది కూడా ఆటలో భాగమేనట..
ఇక తాజా ఎపిసోడ్‌లో తానొక అందమైన రాణిగా తెగ ఫీల్ అవుతుంటుంది సిరి. తన అందం గురించి తన సేవకుడు షణ్ముఖ్‌తో పొగిడించుకోవాలని అనకున్న సిరికి షాకిస్తాడు షణ్ముక్. నేను ఎలా ఉన్నాను. బాగున్నానా, సిరి బాగుటుందా? అని షణ్ముఖ్‌ను అడిగింది. దీంతో మీరే బాగుంటారని షణ్ముఖ్ చెప్పగా.. అంటే సిరి బాగోదా అని మళ్లీ అడుగడంతో ‘మీకు చాలా ఊహించుకుంటున్నారు.. అదంతా మీకు వెయిట్ ఇవ్వడం వల్లేనేమో.. కానీ, యావరేజ్ ఫిగర్ మీరు’అంటూ నవ్వుతూనే చెబుతాడు షణ్ముక్. దీంతో ఒక్కసారిగా సిరి నోట నుంచి మాట రాలేదంటే ఒట్టు.
big boss-5 Episode 68 -2
సిరి పోతే గ్లామర్ పోయినట్టేనా..
ఇప్పటివరకు ఎలిమినేటైన వారికంటే సిరి ఎందులో బెస్ట్ అంటే ఎవరైనా చెబుతారా? ఒక్క ‘మోజ్’ రూమ్ ముచ్చట్లలో తప్పా.. షణ్ముఖ్‌తో ముద్దులు, హగ్‌లు, గ్లామర్ షో తప్పా హౌస్‌లో పెద్దగా చేసింది ఏమీ లేదు. కాకపోతే సిరి టాలెంట్ వేరు. ఆమె ఎప్పుడు ఎవరితో ఉండాలో, ఎవరికి టాటా చెప్పాలో, ఎవరికి హాయ్ చెప్పాలో అన్ని తెలుసు.
షణ్ముక్ తో ఉంటేనే సిరికి మార్కులు పడుతున్నాయనేది వాస్తవం. అందుకే అతనితో ఎంత గొడవ పెట్టుకున్నా సోమవారం అనగా నామినేషన్స్ కంటే ముందే శని, ఆదివారాలో తిరిగి షన్నూకు దగ్గర అవుతుంది. లేకపోతే సిరి మీద కోపంతో ఎవరూ ఒక్క ఓటు కూడా వేయరని ఆమెకు ముందే తెలుసు.