Big Boss -5 Episode 76 : బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ పాస్ కోసం కొత్తగా పంచాయితీ నడుస్తుంది. టాస్క్‌ను కంప్లీట్ చేసేందుకు అందరూ బిగ్‌బాస్ చెప్పినట్టు చేస్తే కాజల్ మాత్రం రెండు నాల్కల ధోరణితో కొత్త స్కెచ్ వేసి మానస్‌ను పిచ్చోడిని చేసి సన్నీని సేవ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
బిగ్‌బాస్ ఇంట్లో 75వ రోజు ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ జరగగా.. ‘రింగ్ ఈజ్ కింగ్’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో మానస్ విజయం సాధిస్తాడు. రింగ్ ను చివరి వరకు పట్టుకుని ఉండటంతో 11వారం కెప్టెన్‌గా మానస్ బాధ్యతలు స్వీకరిస్తాడు. కాజల్ దగ్గరకు వెళ్లి నీకు ఏ డిపార్ట్మెంట్ కావాలని అడుగడంతో ఏదైనా ఓకే అంటుంది కాజల్. ఇక మానస్ కెప్టెన్ కావడంతో సన్నీ, మానస్ ఒకరికొకరు ద్దులు పెట్టుకుంటారు.
ఎలిమినేషన్ కోసం ఎవిక్షన్ పాస్..
ఎలిమినేషన్‌ను తప్పించుకోవాలంటే ఎవిక్షన్ పాస్ పొందాలని బిగ్‌బాస్ టాస్క్ ఇస్తాడు. ఇళ్లు కాలిపోవడం,ఫైర్ ఇంజిన్ టాస్క్ అంటాడు. సైరన్లు మోగాక ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కిన ఇద్దరూ ఒకే మాట మీద ఉండి ఒకరిని కాపాడాలి. లేకపోతే ఇద్దరి పిక్చర్స్ కాలిపోతాయి. ఇలా చివరకు ఎవరు మిగులుతారో వారికి ఎవిక్షన్ పాస్ వస్తుంది అంటాడు బిగ్ బాస్. తొలి రౌండ్‌లో రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కగా శ్రీరామచంద్ర, మానస్‌ల ఫోటోలు వస్తాయి. అందులో శ్రీరామచంద్రను కాపాడి మానస్ ఫోటోను కాల్చేస్తారు.ఆ తర్వాత మానస్, సన్నీలు ఎక్కి ఆనీ మాస్టర్, రవి ఫోటోల్లో ఆనీని సేఫ్ చేస్తారు.
Big Boss -5 Episode 76-1
ఆ తర్వాత మానస్, కాజల్ ఎక్కగా వీరికి ఆనీ, సిరి ఇద్దరిలో ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి రాగా.. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరి ఫోటోలు కాలిపోతాయి. చివరకు సన్నీ మిగిలిపోగా అతనికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభిస్తుంది. కాజల్ ముందుగా ప్లాన్ చేసిన గేమ్ ఇదే.. కానీ ఎవరికీ చెప్పదు. అందుకోసం సిరిని బలిచేస్తుంది. తాను సిరికి సపోర్ట్ చేస్తానని కాజల్ అనడంతో మానస్ మాత్రం ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేస్తానని అంటాడు.
కాజల్ స్కెచ్ వేసి మరీ సన్నీకి సపోర్టు..
వీరిద్దరికీ అసలు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు మానస్ కూడా కాజల్ దారిలోకే వచ్చి సిరికి సపోర్ట్ చేస్తాడు. వెంటనే కాజల్ మాట మార్చి నేను ఆనీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తానంటుంది. అదేంటి ఇప్పటివరకు సిరికి సపోర్టు చేస్తానని మళ్లీ ఇప్పుడు ఆనీకి సపోర్టు చేస్తానంటావ్ ఏంటీ? అని మానస్ అనడంతో అది అప్పుడు.. ఇది ఇప్పుడు అని కాజల్ అనే సరికి మానస్ షాక్ అవుతాడు. ఇదంతా కాజల్ కు ముందే తెలుసు. సన్నీకి ఎవిక్షన్ పాస్ దక్కాలని ఇలా చేస్తుంది.