Big Boss -5 Episode -94 : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ చాలా ఆసక్తిగా సాగుతోంది. డిసెంబర్ 8వ తేదిన బిగ్‌బాస్ షో 94వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ గేమ్ షోకు మరో రెండు వారాల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ భాగంలోని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో సభ్యులకు బిగ్‌బాస్ రోల్ రిక్రియేషన్ టాస్క్ ఇచ్చాడు. ముందుగా సూపర్ లగ్జరీ ఫుడ్ ఐటమ్స్‌తో కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఐటమ్స్ పొందాలంటే గులాబ్ జామున్ టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువ తింటారో వారికి సూపర్ లగ్జరీ ఐటమ్స్ పొందవచ్చని కండిషన్ పెట్టగా సిరి మినహా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. ఇక సిరి తిండి చూసి సభ్యులందరూ షాక్ అయ్యారు.సన్నీ అయితే నువ్ మనిషివేనా అంటూ అడిగాడు..
షణ్ముక్‌ను అప్పడంలాగా నలిపేసిన సన్నీ..
ఆడియెన్స్ మెచ్చే విధంగా సభ్యులు ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో వారికి ఓటింగ్ బూత్ నుంచి ఓటింగ్ కోసం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెబుతాడు. ఇందులో షణ్ముఖ్‌లా సన్నీ.. సన్నీలా సిరి.. ఆనీ మాస్టర్‌లా మానస్.. కాజల్‌లా శ్రీరామ్..రవిలా కాజల్ అద్భుతంగా నటించారు.
Big Boss -5 Episode -94-1
ఇక షన్నూ పాత్రలో ఉన్న సన్నీ.. సిరి పాత్రలో ఉన్న షన్నూను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నిరోజులు వాళ్లు హౌస్‌లో చేసిన దరిద్రాన్ని ఒక్కదెబ్బతో వాళ్లకు అర్థం అయ్యేలా చేశాడు. సన్నీ దెబ్బకు ఇన్నిరోజులు మేము ఏం తప్పు చేశామో ఇప్పుడు సిరి, షన్నూలకు అర్థం అయి ఉంటుంది. ముందుగా మమ్మీ ఫ్రెండ్ షిప్ హగ్ అని చెబుతూ.. షన్నూను అప్పడం నలిపినట్టు నలిపేశాడు సన్నీ.. సిరి, షణ్ముక్ మాత్రం ఆ టైంలో సన్నీని ఏమి అనకుండా మిన్నకుండిపోయారు.
సన్నీకి వార్నింగ్ ఇచ్చిన షణ్ముక్.. సిరి ఇక వదిలేయ్..
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తయ్యాక షణ్ముక్ సన్నీ వద్దకు వెళ్లి నువ్వు క్యారెక్టర్ చేయు అంటే వెకిలిగా చేశావ్.. నన్ను ఇమిటేట్ చేయడం వేరు. వెలికి చేయడం వేరు.. ఇంకోసారి ఇది రిపీట్ కావొద్దని షన్నూ సన్నీకి గట్టిగా చెప్పాడు.దీనికి సన్నీ కూడా ఒకే కూల్.. నేను మళ్లీ రిపీట్ చేయను అంటూ వెళ్లి షణ్ముక్ ను హగ్ చేసుకున్నాడు. నీ గురించి నేను కూడా అలా వెకిలిగా బీహేవ్ చేస్తే నీకు బాధ అంటే ఏంటో తెలుస్తుందని షణ్ముక్ అంటాడు సన్నీతో..ఇక సిరి కూడా వదిలేయ్, దీనిని పెద్దగా చేయకు అని షన్నూకు చెబుతుంది. చేసిందంతా చేసి హగ్ ఇస్తే బాధపోతుందా? ఇదంతా బయటకు పోతుంది. తర్వాత ఎలా ఉంటుందని ఫీల్ అవుతాడు షన్నూ..