big boss-5 Episode 9th : కన్నీళ్లు పెట్టించిన జెస్సీ.. నా వాళ్ల కాలేదు, మీరైనా సాధించి చూపించండి

big boss-5 Episode 9th : బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ రౌండ్ ముగియగా.. ఈసారి ఎవరూ ఊహించని విధంగా నామినేషన్స్ సాగాయి. ఇకపోతే జెస్సీని హౌస్ నుంచి బయటకు రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో జెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. జెస్సీ వెళ్లిపోయేటప్పుడు షణ్ముఖ్, సిరిలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆనీ మాస్టర్‌కు స్పెషల్ పవర్.. కాజల్ ఔట్ నిన్నటి నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో ఆనీ మాస్టర్‌‌కు బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. ఎవరినైతే బయటకు […].

By: jyothi

Published Date - Wed - 10 November 21

big boss-5 Episode 9th : కన్నీళ్లు పెట్టించిన జెస్సీ.. నా వాళ్ల కాలేదు, మీరైనా సాధించి చూపించండి

big boss-5 Episode 9th : బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ రౌండ్ ముగియగా.. ఈసారి ఎవరూ ఊహించని విధంగా నామినేషన్స్ సాగాయి. ఇకపోతే జెస్సీని హౌస్ నుంచి బయటకు రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో జెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. జెస్సీ వెళ్లిపోయేటప్పుడు షణ్ముఖ్, సిరిలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆనీ మాస్టర్‌కు స్పెషల్ పవర్.. కాజల్ ఔట్

నిన్నటి నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో ఆనీ మాస్టర్‌‌కు బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. ఎవరినైతే బయటకు పంపాలనుకుంటున్నారో వారిని ఆనీతో నామినేట్ చేయించారు. అయితే, ఆనీ కావాలని కాజల్‌ను నామినేట్ చేసింది. ఇకపోతే సన్నీ, మానస్‌లను కాపాడకుండా కాజల్.. షణ్ముఖ్‌ను సేవ్ చేయడంతో సన్నీ అలిగాడు.

అనారోగ్యంతో బాధపడుతన్న జెస్సీ.. షణ్ముఖ్, సిరిలకు దూరంగా ఉంటున్నాడు. అతనితో మాట్లాడేందుకు షణ్ముఖ్ ప్రయత్నించాడు. ఈ రోజైనా నాతో మాట్లాడతావా? లేదా అని షణ్ముక్ అడిగాడు. అందరితో బానే ఉన్నావు.. నాతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్ముక్ జెస్సీ వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇంతలో జెస్సీ ఆరోగ్యం గురించి అడిగి.. మీకు మెడికల్ హెల్ప్ చాలా అవసరం.. మీరు హౌస్ నుంచి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ జెస్సీని ఆదేశిస్తాడు.

Bigg Boss 5 Telugu, Episode 66-2

Bigg Boss 5 Telugu, Episode 66-2

కన్నీళ్లు పెట్టించిన జెస్సీ.. సిరితో పాటు షణ్ముక్ కూడా..

నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ బిగ్‌బాస్ అంటూనే జెస్సీ ఎమోషనల్ అవుతాడు.. నాగ్ సార్ ‘ఐ మిస్ యూ’అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను హౌస్‌ను వీడుతున్నానని సభ్యులకు చెబుతూనే కంటతడి పెట్టుకున్నాడు. దీంతో సిరి, షణ్ముఖ్‌ కూడా బోరున ఏడ్చేశారు. సిరి, షణ్ముక్ మీ ఇద్దరితో నాకు జర్నీ ఈ రోజు వరకే రాసుంది. నేను సాధించలేకపోయింది.. మీరు సాధించి చూపించాలని జెస్సీ ఏడుస్తూ అందరినీ ఏడిపించాడు.

మొన్నటివరకు శత్రువుల్లా కనిపించిన కాజల్, శ్రీరామ్‌ సన్నిహితంగా కనిపించారు. తర్వాత మానస్‌, ప్రియాంకపై చిరాకు పడుతాడు. మాసన్ తింటున్న టైంలో అది కావాలా.. ఇది కావాలా అనడంతో మాసస్‌కు చిర్రెత్తుకొస్తుంది. తిన్నాక మాట్లాడుతా అంటాడు. కాజల్‌ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న రవి.. ఈ రోజు కాజల్ వద్దకు వచ్చి, నీకు నాకంటే శ్రీరామ్ ఎక్కువనా అని అడుగుతాడు. మరోవైపు జెస్సీ, మానస్‌లను కాపాడకుండా షణ్ముఖ్‌ను కాజల్ సేవ్ చేయడంతో వారిద్దరూ కాజల్‌కు దూరంగా ఉంటారు. కాజల్.. మానస్, జెస్సీల వద్దకు వెళ్ళి ఈ వారం నేను ఎలాగూ బయటకు వెళ్లిపోతా.. నాతో మాట్లాడాలని తెగ బాధపడుతుంది. మధ్యలో సన్నీ కలుగజేసుకుని నువ్వు ఎందుకు ఎలిమినేట్ అవుతావు అని సీరియస్ అవుతాడు.

Tags

Related News