Big Boss -5 : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఆడియెన్స్‌ను చాలా ఓ వైపు కన్ ఫ్యూజ్‌తో పాటు ఒక్కోసారి పిచ్చెక్కిస్తోంది. హౌస్ లోని సభ్యుల ప్రవర్తన, కొట్లాట చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగక మానదు. ఇక సిరి, షణ్ముక్ మధ్య కనెక్షన్ ఏంటని అందరూ జుట్టు పీక్కుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే విషయమై యాంకర్ రవి ఆడియెన్స్‌కు క్లారిటీ ఇచ్చాడా లేదా ఇప్పుడు తెలుసుకుందాం..
సోమవారం రాగానే నామినేషన్స్ రౌండ్స్‌తో పాటు కెప్టెన్సీ అంశం ముందుకు వస్తుంది. ఈ ఎపిసోడ్‌లో కెప్టెన్ పోటీదారుల టాస్క్‌లో భాగంగా సన్నీకి పవర్ టూల్ లభిస్తుంది. రెండు కవర్లు ఇచ్చి అందులో ఒకటి ఎంచుకుని పవర్ ఉపయోగించాలని సన్నీకి చెబుతాడు బిగ్‌బాస్.
దీని ప్రకారం ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర ముత్యాలు కలెక్ట్ చేసి వేరే వ్యక్తులకు ఇవ్వాలనడంతో సన్నీ సిరి దగ్గర తీసుకుని మొదట మానస్‌కు ఇద్దామనుకుంటాడు. కానీ మన మధ్య గ్యాప్ ఫిలప్ చేయ్ అనడంతో షన్నూకు ఇస్తాడు సన్నీ..
big boss shannnnu
మళ్లీ అలిగిన సిరి..
తనకు సాయం చేసిన సన్నీకి థాంక్స్ చెప్పాలని షన్నూ కోరగా నోవే అంటుంది సిరి. ఎందుకురా ఇలా చేస్తావ్ అని షన్నూ అనడంతో నా ముత్యాలు దొబ్బేశాడు నేను ఎందుకు థాంక్స్ చెప్పాలంటుంది సిరి. ఇకపోతే ఫస్ట్ రౌండ్‌లో ఎక్కువ గోల్డ్ కాయిన్స్ సంపాదించిన మానస్, ప్రియాంకలు తొలి రౌండ్ కెప్టెన్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారిద్దరికి బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో మానస్‌ను ఓడించి కాజల్ మొదటి కెప్టెన్ పోటీదారుగా నిలుస్తుంది.
మా ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ అదే అంటున్నసిరి..
నిన్న మీ ఇద్దరి మధ్య ఏమైందని సిరిని అడుగుతాడు రవి. అదేంటి మరీ తప్పు నాదే అని షన్నూ అన్నాడు అని రవి సిరితో అంటాడు. దీంతో సిరి తెగ సిగ్గుపడుతుంది. మీరిద్దరూ నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది మీ మధ్య అంటూ అడుగుతాడు. మేము మంచి ఫ్రెండ్స్ అనగా.. మీ ఇద్దరిని చూస్తే అలా కనిపించడం లేదు. ఒకరికోసం ఒకరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోందని రవి అనడంతో సిరి ఆనందానికి అవధుల్లేవ్. వీరిద్దరి మధ్య ఏం ఉందో బయటకు చెప్పకోలేకపోయినా గేమ్ గెలిచేందుకు, జనాలను పిచ్చోళ్లను చేయడానికి మాత్రం సిరి, షన్నూ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారు కొందరు.