Bigg Boss-5 Episode 65th : సిరి, షణ్ముక్ ఇద్దరూ ఒక్కటే.. పక్కా స్కెచ్ వేసి మరీ గేమ్ ఆడుతున్నారన్న మానస్

Bigg Boss-5 Episode 65th : సోమవారం రాగానే బిగ్‌బాస్ ఇళ్లు ఒక్కసారిగా వేడెక్కుతుంది. కారణం ఈ రోజునే నామినేషన్స్ ఉంటాయి. ఇందులో ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారనేది డిసైడ్ అవుతుంది. ప్రతీవారం లాగే ఈసారి కూడా నామినేషన్స్ జోరుగా సాగాయి. అయితే, హౌస్ నుంచి బయటకు వచ్చిన వారు ఏం చెబుతున్నారంటే.. బిగ్‌బాస్ గేమ్ షో మొత్తం ముందే ఫిక్స్ చేశారని, హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎవరు ఎన్నిరోజులు ఇక్కడ ఉంటారు. ఎప్పుడు ఎలిమినేట్ […].

By: jyothi

Published Date - Tue - 9 November 21

Bigg Boss-5 Episode 65th : సిరి, షణ్ముక్ ఇద్దరూ ఒక్కటే.. పక్కా స్కెచ్ వేసి మరీ గేమ్ ఆడుతున్నారన్న మానస్

Bigg Boss-5 Episode 65th : సోమవారం రాగానే బిగ్‌బాస్ ఇళ్లు ఒక్కసారిగా వేడెక్కుతుంది. కారణం ఈ రోజునే నామినేషన్స్ ఉంటాయి. ఇందులో ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారనేది డిసైడ్ అవుతుంది. ప్రతీవారం లాగే ఈసారి కూడా నామినేషన్స్ జోరుగా సాగాయి. అయితే, హౌస్ నుంచి బయటకు వచ్చిన వారు ఏం చెబుతున్నారంటే..

బిగ్‌బాస్ గేమ్ షో మొత్తం ముందే ఫిక్స్ చేశారని, హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎవరు ఎన్నిరోజులు ఇక్కడ ఉంటారు. ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు.. ఎవరినీ ఏ వారం నామినేట్ చేస్తారో ముందే తెలుసునని చెబుతున్నారు. ఉమాదేవి మాట్లాడుతూ.. యాంకర్ రవికి బిగ్‌బాస్ ఈ ఆట గురించి మొత్తం చెప్పి పంపించారని చెప్పింది. షణ్ముఖ్-సిరికి కూడా అంతా తెలుసునని అందుకే పక్కాగా గేమ్ ఆడుతున్నారని సిరి, మానస్‌లు చెప్పారు.

సిరి, షణ్ముక్ ఒక్కటే స్కూల్ అంట..

జోడీ బ్రదర్స్ సన్నీ, మానస్‌లు మాటల్లో భాగంగా సిరి, షణ్ముక్ ఇద్దరూ ఒక్కటే అని నిర్దారణకు వచ్చారు. నేను 10 వారాలు ఉంటే చాలని షణ్ముఖ్ తనతో అన్నట్టు సన్నీ మానస్‌కు చెప్పాడు. సిరి, షణ్ముక్ మనసులో ఉద్దేశ్యం ఒక్కటే ఉంటుందని.. కానీ, బయటకు వేరేలా మాట్లాడుతారని వివరించాడు సన్నీ.. అయితే, ఇద్దరూ కంటెంట్ ఇవ్వడానికే వచ్చారని, అందుకే మనకు కంటెంట్ ఇస్తున్నారు. ఈ షోకు రాకముందే వీళ్లిద్దరూ ప్రిపేర్ అయ్యి వచ్చారని.. సిరి- షణ్ముక్ ఇద్దరిది ఒకే స్కూల్ అని మానస్, సన్నీ మాట్లాడుకున్నారు.

Bigg Boss-5 Episode 65th-1

Bigg Boss-5 Episode 65th-1

కన్ను కనిపించడం లేదన్న జెస్సీ..

గత రెండు వారాలుగా జ్వరంతో బాధపడుతున్న జెస్సీకి డాక్టర్లు మళ్లీ చికిత్స అందించారు. తనకు ఓ కన్ను సరిగా కనిపించడం లేదని జెస్సీ చెప్పగా, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని డాక్టర్ వెల్లడించారు. ఇక జైలుకు వెళ్లిన కాజల్ వద్ద కూర్చుని జెస్సీ ముచ్చట్లు పెడుతాడు. తనకు ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నానని జెస్సీ చెబుతూనే.. షణ్ముఖ్‌ను తాను బాగా నమ్మాను కానీ, నాపై బాల్స్ వేశాడు. అది భరించలేకపోతున్నానని కాజల్‌తో అంటాడు జెస్సీ.

ఇకపోతే షణ్ముఖ్‌, రవి కూర్చుని మాట్లాడుకుంటుంటారు. పింకీ ఎలిమినేట్ అయితే మానస్ పరిస్థితి ఏంటని షణ్ముఖ్ రవిని అడుగుతాడు. సన్నీ ఉన్నాడుగా చూసుకోవడానికి అని రవి అంటాడు. అదే టైంలో మానస్.. రవి గురించి సన్నీతో ఇలా అంటాడు.. రవిని ముట్టుకోవాలంటే ముందుగా లోబో.. ఆ తరువాత విశ్వను దాటుకుని వెళ్లాలని సన్నీతో అంటున్నాడు మానస్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాంటే తరువాయి భాగం కోసం ఎదురు చూడాల్సిందే.

Tags

Latest News

Related News