Bigg Boss 5 Episode 88 : ఐస్ ట్యూబ్‌లో అరుపులు.. దుప్పట్లో హగ్గులు.. రసవత్తరంగా బిగ్‌బాస్ ఎపిసోడ్

Bigg Boss 5 Episode 88 : బిగ్ బాస్ సీజన్-5 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు అరుపులు, మరోవైపు హగ్గులతో కాక పుట్టిస్తోంది. బుధవారం నాటి 88వ ఎపిసోడ్ సిరి-సన్నీ, సిరి-షణ్ముక్ మధ్య సాగింది. సన్నీ మీద అరిచి, ఏడ్చిన సిరి.. షణ్ముక్ దుప్పట్లో దూరి అతడికి హగ్గులు ఇచ్చి కూల్ చేసింది. మరోవైపు రవిని ఎల్మినెట్ చేసిన షణ్ముకే రవి రవీ అంటూ డ్రామాలకు తెరలేపటం అటు బిగ్ బాగ్ హౌస్‌ కంటెస్టెంట్, ఇటు […].

By: jyothi

Updated On - Thu - 2 December 21

Bigg Boss 5 Episode 88 : ఐస్ ట్యూబ్‌లో అరుపులు.. దుప్పట్లో హగ్గులు.. రసవత్తరంగా బిగ్‌బాస్ ఎపిసోడ్

Bigg Boss 5 Episode 88 : బిగ్ బాస్ సీజన్-5 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు అరుపులు, మరోవైపు హగ్గులతో కాక పుట్టిస్తోంది. బుధవారం నాటి 88వ ఎపిసోడ్ సిరి-సన్నీ, సిరి-షణ్ముక్ మధ్య సాగింది. సన్నీ మీద అరిచి, ఏడ్చిన సిరి.. షణ్ముక్ దుప్పట్లో దూరి అతడికి హగ్గులు ఇచ్చి కూల్ చేసింది. మరోవైపు రవిని ఎల్మినెట్ చేసిన షణ్ముకే రవి రవీ అంటూ డ్రామాలకు తెరలేపటం అటు బిగ్ బాగ్ హౌస్‌ కంటెస్టెంట్, ఇటు వీవర్స్ వీవర్స్ విస్మయానికి గురయ్యారు. ఇంతకూ నిన్నటి షోలో ఏం జరిగిందంటే..


బుధవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ కు బిగ్ బాస్ ఐస్ ట్యూబ్ టాస్క్ ఇచ్చారు. ఐస్ వాటర్‌ నుంచి కాళ్లు బయటకు పెట్టకుండా తమ బాల్స్‌ను కాపాడుకుంటూనే పక్క వాళ్ల బాల్స్‌ను కొల్లగొట్టడమే టాస్క్. దీనిలో ఎవరు ఎక్కువగా బాల్స్ సంపాదిస్తే వాళ్లే ఆ గేమ్ విన్నర్. అయితే సిరి, షణ్మక్ పక్కపక్కనే ఉండి టాస్క్ మొదలు పెట్టడంతో బిస్ బాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి స్థానాలు మార్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కాజల్, మానస్ మధ్యలోకి షణ్ను వెళ్లగా.. సిరి పక్కకు సన్నీ వెళ్లాడు.


వెంటనే ఆట మొదలు పెట్టిన సిరి.. సన్నీ బాల్స్‌ను కొట్టేసింది. అయితే తన కాల్ ట్యూబ్ లోనే ఉందని.. నా బాల్స్ ఎందుకు నొక్కేశావ్ అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు. ఒక కాలు తీసినందుకే బాల్స్ తీసుకున్నానని సిరి వాదనకు దిగింది. అసహానానికి గురైన సన్నీ.. ‘మంచిగా ఆడుదాం అంటే గెలుకుతున్నారు.. ఇక ఆడతా..’ అంటూ బరిలోకి దిగాడు. సిరి కాలు బయటపెడితే బాల్స్ తీసేయడానికి అక్కడే రెడీగా నిలబడ్డాడు. మరో నాటకానికి తెర లేపిన సిరి.. నేను గివ్ అప్ ఇవ్వను గేమ్ ఆడతాను అంటూ పెద్దగా అరుస్తూ.. ఏడ్పు అందుకుంది. మరోవైపు షణ్ముఖ్ సైతం.. సిరీ సిరీ.. రవీ.. రవీ ఐయామ్ ప్లేయింగ్ ఫర్ యు అంటూ అరవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రవిని నామినేట్ చేసి బయటకు పంపించింది షణ్మే కాబట్టి సింపతి కోసం అలా గేమ్ ప్లాన్ చేస్తున్నట్లు అందరి నుంచి విమర్శలు వస్తున్నాయి.

Bigg Boss 5 Episode 88-1

Bigg Boss 5 Episode 88-1

మరోవైపు సన్నీ మానస్ తో మాట్లాడుతుండగా.. సిరి అతడి బాల్స్‌ను కొట్టేసే ప్రయత్నం చేసింది. సన్నీ సైతం ఆమె బాల్స్‌ని కిందపడేసి.. కాళ్లు ట్యూబ్‌లో లేవని చెప్పాడు. అయితే ఇద్దరి మధ్య వాదన జరుగుతుండగా.. షణ్ను పెద్దరాయుడిలా మధ్యలో దూరాడు. సిరి కాళ్లు ట్యూబ్‌లోనే ఉన్నాయని తీర్పు ఇచ్చాడు. అయితే తనను పర్సనల్‌గా ఎటాక్ చేస్తున్నారని.. గేమ్‌ను గేమ్‌లో ఆడటం లేదని ఏడ్చేసింది. పడేసిన బాల్స్ తెచ్చి ఇస్తేనే కాళ్లు కిందపెట్టను అని మొండికేసింది.


దీంతో సన్నీ బాల్స్ తెచ్చి ట్యూబ్‌లోకి వేశాడు. అయినా సన్నీ బాల్స్‌ను సిరి ఏడుస్తూనే కొట్టేసింది. అయితే గేమ్ ముగిసి బజర్ మోగినా.. సిరి ఐస్ నుంచి బయటకు తీయకుండా మొండిగా గేమ్ ఆడటంతో ఆమె కాళ్లకు గాయాలు అయ్యాయి. గాయాలపాలైన ఇంటి సభ్యుల కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి డాక్టర్‌ని పంపారు. డాక్టర్ వచ్చేంతవరకూ ఎవరూ వేడినీళ్లు ఉపయోగించరాదని, అలా వేడినీళ్లు వాడటం హానికరం అని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సిరిని షణ్ముక్ ఎత్తుకుని మెడికల్ రూంకు తీసుకెళ్లాడు. ఈ టాస్క్‌లో సన్నీ 59 బాల్స్‌తో లీడింగ్‌లో ఉండగా.. 29 బాల్స్‌తో లీస్ట్‌లో నిలిచింది ప్రియాంక. అయితే సన్నీ అధికంగా ప్రియాంక బాల్స్ కొట్టేసినప్పటికీ.. ఆమె మాత్రం సన్నీకి ముద్దు ఇచ్చి చిరునవ్వుతో టాస్క్ ముగించింది.


మరోవైపు గాయాల పాలైన సిరికి మానస్ సాయం చేయడంతో ఆమెపై షణ్ముక్ ఫైర్ అయ్యాడు. కుతకుతలాడిపోయాడు. అదే సమయంలో షణ్ను నొప్పి వస్తుందంటూ సిరి చెప్పడంతో బరస్ట్ అయ్యాడు. ‘నాకు నీకంటే ఎక్కువ బాధగా ఉంది.. నామినేషన్స్ రోజు.. కార్నర్ చేసింది వాళ్లు.. గేమ్‌లో కార్నర్ చేసింది వాళ్లు.. ఇప్పుడు దెబ్బ తగిలిందని వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నావ్ బుద్ధిలేకుండా.. నువ్ నా ఫ్రెండ్‌గా ఉన్నందుకు సిగ్గుగా ఉంది.. నాకు లేదా నొప్పి.. నేను ఐస్‌లోనే ఉన్నాను.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనిషికి.. నాకు ఇంత వీక్ ఫ్రెండ్ ఉందని సిగ్గు వేస్తుంది.. నువ్ నా ఫ్రెండ్‌గా ఉండొద్దు ఛీ.. ’ అంటూ రెచ్చిపోయాడు. కాసేపటికి అతడిని కూల్ చేయడానికి షణ్ను దుప్పట్లోకి దూరిన సిరి.. అతడిపై పడుకుని ఓదార్చింది. దీంతో సిరి వెచ్చటి హగ్గుతో కూల్ అయిపోయాడు.

Tags

Latest News

Related News