Bigg Boss 5 Telugu 53 episode : కెప్టెన్ కోసం సాగుతున్న టాస్క్‌లో అందరూ పోటీ పడుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. సిరి కాస్త హద్దులు దాటి షణ్ముక్ తో రొమాన్స్ చేస్తుంది. ఇంకా చాలా ఎక్ట్రాలు చేసింది ఎవరని తెలుసుకోవాలంటే 53వ ఎపిసోడ్ చూడాల్సిందే.
అభయ హస్తం టాస్క్‌లో ఇప్పటికే శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ ముగ్గురూ గెలిచి హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు. మిగతావారంతా ఇక బయటే ఉండిపోయారు. తిండి తినడం పడుకోవడం ఇంకా అంతా హౌస్ బయటే.. కెప్టెన్ పోటీ కోసం టస్క్ లో ఎవరు పాల్గొనాలనే విషయంపై డిస్కషన్ స్టార్ అయింది. హెల్త్ ప్రాబ్లమ్ కారణంగా కెప్టెన్ పోటీ నుంచి తప్పుకుంటున్న చెప్పిన జెస్సీ.. ఉన్నట్టుండి ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. కెప్టెన్ అయిన వారు సైతం గివ్అప్ ఇవ్వట్టేదు.
నేనెందుకు ఇవ్వాలంటూ ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో నేను డ్రాప్ అవుతానంటూ ఆనీ మాస్టర్ చెబుతుంది. మధ్యలో జెస్సీ ఎంట్రీ ఇచ్చి వద్దు వద్దు మీరు ఆడండి నేను డ్రాప్ అవుతున్నాను చెప్పాడు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల డ్రాప్ అవుతున్నానని చెప్పుకోవాలని గానీ ఇలా వేరే వారి కోసం డ్రాప్ అవుతున్నానని చెప్పడం కరెక్ట్ కాదంటూ కాస్త సీరియస్ అయ్యాడు.
Bigg Boss 5 Telugu 53 episode-21
ఈ క్రమంలో జెస్సీకి సిరి సపోర్ట్ ఇచ్చేందుకు ట్రై చేయగా ఆమెపై సన్నీ, షణ్ముక్ కాస్త గట్టిగా మాట్లాడతారు. చివరకు నాల్గో టాస్క్ చేసేందుకు ఆనీ మాస్టర్, పింకీ రెడీ అవుతారు. బోర్టుపై రంగులు నింపడమే ఈ చాలెంజ్. వీరిద్దరు రంగులు నింపుతుండగా… పింకీ, ఆనీ మాస్టర్ ఇద్దరు జారి పడిపోతారు. ఈ క్రమంలో పింకీ నడుముకు దెబ్బ తగలడంతో కాసేపు ఇబ్బంది పడుతుంది. లాస్ట్‌కి ఆనీ రెడ్ కలర్ ఎక్కువ నింపడంతో ఆమె గెలిచినట్టు సన్నీ డిక్లర్ చేస్తాడు.
తర్వాత ఐదవ రౌండులో కాజల్, సన్నీ పోటీ పడగా అందులో సన్నీ విన్ అవుతాడు. అందరిలో షణ్ముఖ్, సిరి,ఆనీ, సన్నీ, శ్రీరామ్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. షణ్ముక్, సిరి మధ్య సరసాలు కాస్త ఓవరయ్యాయి. సిరి.. షణ్ముఖ్‌ని కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. తన్నుకుంటూ.. కాస్త ఓవర్ చేసింది. దీంతో సారీ చెప్పాలంటూ షణ్ముక్ మీదమీదకు వెళ్తే అతడు సిరిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నేను సారి ఇలా చెబుతానంటూ అన్నడు షణ్ముక్. తర్వాత వీరి మధ్య కాస్త రొమాన్స్ జరిగింది. మొదటి విన్ అయిన ఐదురుగు కాకుండా మిగతా వారికి సైతం కెప్టెన్ పోటీదారులుగా అవ్వడానికి బిగ్ బాస్ మరో చాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆడిన బాల్ గేమ్‌లో మానస్ విన్ అయ్యాడు. ఇక మొత్తంగా విన్ అయిన ఆరుగురిలో కెప్టెన్ ఎవరనేది సస్పెన్స్.