Bigg Boss 5 Telugu 54 episode : కెప్టెన్‌గా విన్ అయింది అతనే.. యానిపై కత్తితో దాడికి ట్రై చేసిన సిరి..

Bigg Boss 5 Telugu 54 episode : బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరి మధ్య మరొకరికి కాంపిటీషన్ పెరిగింది. దీంతో ఒకరిని తక్కువ చేసేందుకు మరొకరు స్కెచ్‌లు వేస్తున్నారు. మరి 54వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా…? పింకితో మానస్‌ మాట్లాడాడు. హౌస్‌లోకి ఎంట్రీ అయినప్పటి నుంచే రవి గేమ్ స్టార్ట్ చేశాడని చెప్పాడు. అతడితో ఫ్రెండ్ షిప్ చేయాలని ఎవరికీ లేదని చెప్పొకొచ్చాడు. ఇక యాంకర్ రవి అర్ధరాత్రి త్రిమూర్తుల దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఇంకా […].

By: jyothi

Published Date - Fri - 29 October 21

Bigg Boss 5 Telugu 54 episode : కెప్టెన్‌గా విన్ అయింది అతనే.. యానిపై కత్తితో దాడికి ట్రై చేసిన సిరి..

Bigg Boss 5 Telugu 54 episode : బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరి మధ్య మరొకరికి కాంపిటీషన్ పెరిగింది. దీంతో ఒకరిని తక్కువ చేసేందుకు మరొకరు స్కెచ్‌లు వేస్తున్నారు. మరి 54వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా…? పింకితో మానస్‌ మాట్లాడాడు. హౌస్‌లోకి ఎంట్రీ అయినప్పటి నుంచే రవి గేమ్ స్టార్ట్ చేశాడని చెప్పాడు. అతడితో ఫ్రెండ్ షిప్ చేయాలని ఎవరికీ లేదని చెప్పొకొచ్చాడు. ఇక యాంకర్ రవి అర్ధరాత్రి త్రిమూర్తుల దగ్గరకు వెళ్తాడు.

అక్కడ ఇంకా మెలుకువతోనే ఉన్న షణ్ముక్, సిరి కాలికి దండం పెట్టాడు. మరుసటి రోజు ఏమైందో తెలియదు కాని షణ్నుక్‌కు సడన్‌గా సిరి కిస్ చేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. షాక్‌కు గురైన షణ్ముక్ కొద్దిగా నవ్వాడు. కొద్ది సేపటికే మళ్లీ సిరి మళ్లీ వచ్చింది.. నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నానని, నేను నీతోనే ఉంటే నీకేమైనా ప్రాబ్లమా అంటూ షణ్ముక్‌కు అడిగింది సిరి. షణ్ముక్ ఓ డైలాగ్ వేయడంతో సిరి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇక తర్వాత మరో టాస్క్ వెంటాడు-వేటాడు స్టార్ట్ అయింది. థర్మకోల్‌ బ్యాగులు ధరించిన కంటస్టెంట్స్ సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాలి. గేమ్‌ కంప్లీట్ అయ్యేలోపు ఎవరి బ్యాగ్‌లో ఎక్కువ థర్మకోల్ మిగిలితే వారి విన్ అయినట్టు. ఇక బజర్‌ మోగగానే శ్రీరామ్‌, సన్నీ ఒకరిని మరొకరు తోసుకొని కిందపడిపోయారు. ఈ క్రమంలో సన్నీ ఔట్ అయ్యినట్టు జెస్సీ ప్రకటించాడు. మరో రౌండ్ లో మానస్‌ను శ్రీరామ్‌ కింద పడేయగానే వీరద్దరూ ఔట్ అని జెస్సీ ప్రకటించాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన సన్నీ.. జెస్సీ ముందు ఉన్న బ్యాగును తన్నేశాడు.

Bigg Boss 5 Telugu 54 episode-11Bigg Boss 5 Telugu 54 episode-11

Bigg Boss 5 Telugu 54 episode-11

మరో రౌండ్‌లో యానీని.. షణ్ముక్, సిరి టార్గెట్ చేసి ఆడుకుంటారు. ఈ క్రమంలో కాస్త సీరియన్ అయిన యానీ.. గేమ్‌లో నిజాయితీ లేదంటూ సిరిని తోసేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన సిరి.. కత్తితో యానిపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. తప్పు అంటూ వారించారు. దీంతో సిరి కత్తిని కిందపడేసింది. సభ్యులంతా గ్రూపులు కట్టి ఆడుతున్నారు. నేను ఒంటరిగా ఆడుతూ కెప్టెన్ కావడం కష్టమంటూ యానీ కాస్త ఎమోషనల్ అయింది.

దీంతో స్వచ్ఛందంగా గేమ్‌లో యానీ తప్పుకుంది. హౌస్ లో ఉన్నంత కాలం తాను కెప్టెన్‌ను కాలేనని ఏడ్చేసింది. పందులు గుంపులు గుంపులు గా ఆడతాయని, సింహము సింగిల్ గానే ఆడుతుందంటూ డైలాగ్స్ వేసింది. చివరకు సిరిపై షణ్ముక్ గెలిచి కెప్టెన్ అవుతాడు. దీంతో సిరి మళ్లీ రెచ్చిపోయి అతనికి హగ్గులు ఇచ్చింది. ఎవరిని టార్గెట్ చేయాలో ఫిక్స్ అయ్యానని సన్నీతో చెప్పాడు మానస్. పేర్లు మాత్రం చెప్పలేదు.

Tags

Latest News

Related News