Bigg Boss 5 Telugu 55 episode : బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య పోటీతత్వం బాగా పెరిగిపోతున్నది. ఈ వారం ఎన్నికైన కొత్త కెప్టెన్ ఎవరు? ఈ వారం చెత్త ఆటగాడు అనేది ఉత్కంఠగా సాగింది 55వ ఎపిసోడ్‌లో.. ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్కులో అవమాన భరించలేకపోయాడు జెస్సీ. మొత్తంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. అనంతరం మాస్క్‌కు ఇచ్చిన టాస్క్ వెరీ టఫ్‌గా ఉండింది. మానస్ ఐదు రెండ్ల ఆట ఆడాల్సి ఉంటుందని పేపర్‌లో రాసి ఉంచారు. అయితే, యాంకర్ రవి గే ప్లాన్ చేంజ్ చేసినట్లు కనబడుతుంది.
షణ్ముక్‌తో దూరంగా ఉంటే ఆటలో వెనక పడతానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సిరి, షణ్ముక్, జెస్సీలతో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే సన్నీ మళ్లీ రూల్ బుక్ చదువుకున్నాడని సిరి సెటైర్ వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయమై సంచాలకుడి నిర్ణయమే ఫైనల్ అని షణ్ముక్ చెప్తాడు.
ఇక యానీ మాస్టర్.. జెస్సీ, శ్రీరామ్‌లతో కూర్చొని సంచాలకుడిగా గ్రేట్ జాబ్ చేశావ్ అంటూ పొగిడేస్తుంది.
Bigg Boss 5 Telugu 55 episode
హౌస్‌లో మాస్కుతో ఉన్న ఒకే ఒక పర్సన్ శ్రీరామ్ చంద్ర అని కాజల్ అంటుంది. ఇకపోతే టాస్కుల్లో భాగంగా పాల్గొన్న షణ్ముక్ కంటే యానీ మాస్టర్ బ్యాగ్‌లోనే బాల్స్ ఎక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా అతడిని కెప్టెన్ చేశారని సన్నీ బాధపడుతుంటాడు. ఈ క్రమంలోనే మనసులో బాధను ఏం పెట్టుకోవద్దని కాజల్ సన్నీకి ధైర్యం చెప్తుంది.కెప్టెన్ అయినప్పటికీ షణ్ముక్ జస్వంత్ వ్యవహార శైలిలో పెద్దగా తేడా ఏం కనబడదు. మోజ్ రూంలో సిరితో ముచ్చట కొనసాగుతోంది. అయితే, సిరి మాత్రం మా షన్ను కెప్టెన్ అయిపోయాడని మురిసిపోతుంది. అయితే, టాస్క్ పర్ఫార్మెన్స్‌తో సత్తా చాటాలని ఈ క్రమంలో అనుకుంటాడు షణ్ముక్.
ఇక వరస్ట్ పర్ఫార్మర్ నామినేషన్స్ షురూ అవుతాయి. ఈ వారం చెత్త ఆటగాడు ఎవరు అనేది ఉత్కంఠ నడుమ తేలింది. షణ్ముక్ కాజల్‌ను వరస్ట్ పర్ఫార్మర్‌గా నామినేట్ చేయగా, ఆ తర్వాత జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీ నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత లోబో యానీ మాస్టర్ చెత్త పర్ఫార్మర్ అని నామినేట్ చేస్తాడు. మానస్ వరస్ట్ సంచాలకుడని పేర్కొన్న జెస్సీ, మానసే వరస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ అని అంటుంది. రవి సైతం వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీని నామినట్ చేశాడు. అలా కంటెస్టెంట్స్ అందరూ చెత్త ఆటగాడి నామినేషన్స్ వేయగా చివరకు టై అయింది. సన్నీకి, కాజల్‌కు సేమ్ ఓట్లు రాగా, హౌస్ సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చి కెప్టెన్‌గా ఉన్న షణ్ముక్ జస్వంత్ డెసిషన్ తీసుకోవాలని చెప్తారు. దాంతో షణ్ముక్ జస్వంత్ సన్నీని వరస్ట్ పర్ఫార్మర్ అని అంటాడు. అలా సన్నీ కటకటాల్లోకి వెళ్లాడు.