Bigg Boss 5 Telugu 56 episode : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడాలు, గిల్లుకోవడాలు, కొట్లాటల స్థాయి నుంచి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే స్థాయి వరకు వెళ్లారు కంటెస్టెంట్స్. శనివారం నాటి 56వ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ గట్టిగానే జరిగింది. ఆ ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం.
సన్నీని జైలుకు పంపాలని కెప్టెన్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ డెసిషన్ చెప్పడంతో సన్నీ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇకపోతే జైలులో ఉన్న సన్నీ ఆగ్రహంతో ఉన్నాడు. జైలులో ఉన్న సన్నీతో మానస్, రవి మాట్లాడుతుండగా, వారి మధ్య గొడవ జరుగుతుంటుంది. ఇకపోతే సిరి, షణ్ముక్, జెస్సీ వారి ప్రపంచంలో వారు హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్‌కు పూరీ మేకింగ్ టాస్క్ ఇచ్చాడు.
కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా డివైడ్ అయి పూరీలు చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో యానీ, రవి, శ్రీరామ్, విశ్వ, లోబో ఒక టీంగా , మానస్, ప్రియాంక, కాజల్, సిరి, జెస్సీ మరొక టీంగా ఫామ్ అయ్యారు. ఈ టాస్క్‌కు సంచాలకుడిగా హౌస్ కెప్టెన్ షణ్ముక్ జస్వంత్ ఉన్నాడు. యాభై పూరీలు చేయాల్సి ఉండగా, కాజల్ టీం సభ్యులు తొందరగా పూరీలు చేసి టాస్క్ కంప్లీట్ చేయడంతో కాజల్ టీంను విన్నర్‌గా షణ్ముక్ ప్రకటించేశాడు.
Bigg Boss 5 Telugu 56 episode
షణ్ముక్ కాజల్ టీంను విజేతగా ప్రకటించడంతో సన్నీ నిజమా అని జైలులో ఉండే అడుగుతాడు. అప్పుడు రూల్ బుక్ ప్రకారం చెప్పానని షణ్ముక్ అంటాడు. ఈ క్రమంలోనే యానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కూడా కష్టపడి పూరీలు చేశామని చెప్పింది. ఇంతలో ఈమెకు తెలుగురాదని యానీ మాస్టర్‌ను ఉద్దేశించి సన్నీ అంటాడు. దాంతో యానీ మాస్టర్ ఇంకా ఫైర్ అయింది. తాను వర్క్ చేసింది తెలుగు ఇండస్ట్రీలోనేనని పేర్కొంది. తాను పుట్టింది తెలంగాణలోనేనని, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఏంటి అని అరిచేసింది యానీ. ఈ క్రమంలోనే సన్నీ కూడా ఫైర్ అయ్యాడు.
తాను నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే పాయింట్ లేవనెత్తలేదని చెప్తూనే మీరే లేవనెత్తారంటూ యానీ మాస్టర్‌ను ఉద్దేశించి అన్నాడు.నార్త్ ఇండియాలో చపాతీ ఫాస్ట్‌గా చేస్తారనడంలో తప్పేంటి అని అడుగుతాడు. మొత్తంగా ప్రాంతీయ విద్వేషాలు చెలరేగాయనే చెప్పొచ్చు. ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చేసి ఒక్కొక్కరికి క్లాస్ పీకడం స్టార్ట్ చేశాడు. రవి, లోబోకు క్లాస్ పీకిన నాగ్.. వైకుంఠపాళి గేమ్ ఆడించి.. కాజల్‌ను స్నేక్‌గా నామినేట్ చేశాడు. ఆ తర్వాత సామెతల టాస్క్ కూడా ఇచ్చాడు నాగ్.. అంతలోనే ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో గెస్టులుగా శ్రియ, సుమ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారు.