Bigg Boss 5 Telugu 57 episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ షో కాస్త హద్దులు దాటుతున్నా.. ఎప్పటికప్పుడు ట్విస్టులతో ఆడియన్స్‌ను ఆకట్టుకూనే ఉంటుంది. ఇక 57వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. హౌస్‌లో అంతా ఫన్ ఎన్విరాన్‌మెంట్ కొనసాగింది. దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్‌లో సభ్యులంతా ఎంజాయ్ చేశారు. ఇందులో పటాక జోడి పేరుతో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. దీంతో కంటస్టెంట్లను పెయిర్‌గా విడగొట్టేశారు.
సిరి-షణ్ముక్, మానస్-ప్రియాంక, రవి-జెస్సీ, కాజల్-సన్నీ, విశ్వ-లోబో, యానీ-శ్రీరామచంద్రను జోడీలుగా మార్చేశాడు నాగార్జున. మధ్యలో హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. హౌస్ సభ్యులతో కాస్త టైంపాస్ చేశారు. పుష్పకవిమానం మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. భామల హాట్ పర్ఫార్మెన్స్‌తో హౌస్ అంతా సందడి వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే కల్పన తన పేరడి సాంగ్‌తో ఊపు ఊపేసింది.
ఆ పాటలో సభ్యుల స్ట్రెంత్, వీక్‌నెస్ చెప్పింది. అనంతరం కంటెస్టెంట్స్ అందరు టపాసులు అమ్మారు. చివరగా షణ్ముక్ టీం గెలిచింది. మోజ్ గేమ్ లో విన్ అయిన వారికి ఫారన్‌ట్రిప్ అవకాశం వస్తుంది. ఇక పటాకజోడిగా సిరి-షణ్ముక్, రవి-జెస్సీలకు ఈక్వల్ స్కోర్ వచ్చింది. దీంతో లక్‌బేస్డ్‌ను నాగార్జున సెలక్ట్ చేసుకున్నాడు. చిట్టీలో రవి-జెస్సీ పేరు వచ్చింది. దీంతో ఫారిన్ ట్రిప్ గెలిచిన జోడిగా, పటాక జోడిగా రవి-జెస్సీ గెలుపొందారు.
Bigg Boss 5 Telugu 57 episode-2
ఇదంతా జరుగుతుండగా చివరకు లోబో ఎలిమినేట్ అయ్యాడంటూ నాగార్జున బాంబ్ పేల్చాడు. అనంతరం లోబో బయటకు వెళ్లే టైంలో కంటెస్టెంట్స్ గురించి మాట్లాడమని నాగార్జున అడిగాడు. లోబో కేవలం ఫ్రెండ్స్ గురించి మాత్రమే చెప్పాడు. విశ్వ, కాజల్, యానీ, సన్నీ, రవి తన ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
నాకు విశ్వ ఎప్పుడూ సపోర్ట్ గా ఉండేవాడు. ఏదైనా అర్థం కాని సందర్భంగా దానికి వివరించేవాడని చెప్పాడు లోబో. ఇక సన్నీది, నాది సేమ్ వ్యక్తిత్వమని, ఇద్దరమూ ఒకేలాగా ఆలోచిస్తామన్నాడు. సన్నీకి పెళ్లి కాలేదని, తనకు పెళ్లి అయిందని, బాధ్యతతో ఉన్నానంటూ చెప్పాడు. ఇక యానీ మాస్టరు తప్పకుండా కెప్టెన్‌గా కనిపించాలని, యానీ మాస్టర్ కెప్టెన్ అయితే తన గల్లీలో టపాసులు పెలుస్తానంటూ చెప్పాడు లోబో. ఫైనల్‌గా కాజల్ చాలా మంచిదని సర్టిఫై చేశాడు. రవికి ఏమీ చెప్పకపోయిన కూడా అతడు అన్నింటినీ అర్థం చేసుకుంటాడని చెప్పాడు. ఈ క్రమంలో లోబో కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం హౌస్ నుంచి లోబో బయటకు వెళ్లిపోతాడు. అతనికి కంటస్టెంట్స్ అందరూ సెండాఫ్ ఇస్తారు.