Bigg Boss 5 Telugu 58 episode : జెస్సీకి హెల్త్ ప్రాబ్లమ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి

Bigg Boss 5 Telugu 58 episode : మార్నింగ్ నుంచే జెస్సీ కాస్త అస్వస్థతకు గురయ్యాడు. వాంతింగ్ చేసుకున్నాడు. దీంతో సన్నీ జెస్సీకి సపోర్ట్ చేశాడు. అతని వద్దే ఉన్నాడు. జెస్సీ హెల్త్ బాగోలేకున్నా.. షణ్ముక్, సిరి అతన్ని కనీసం పట్టించుకోలేదని మానస్‌తో సన్నీ వాపోయాడు. వారి మధ్యకు వెళ్లొద్దని మానస్ సజిషన్ ఇచ్చాడు. జెస్సీ బెడ్ పై కూర్చొని ఇబ్బంది పడుతున్నా.. కనీసం ఏమైందని కూడా షణ్నుక్ అడగలేదు. సీక్రెట్‌ టాస్క్‌ ఫెయిల్ అయినప్పటి […].

By: jyothi

Published Date - Tue - 2 November 21

Bigg Boss 5 Telugu 58 episode : జెస్సీకి హెల్త్ ప్రాబ్లమ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి

Bigg Boss 5 Telugu 58 episode : మార్నింగ్ నుంచే జెస్సీ కాస్త అస్వస్థతకు గురయ్యాడు. వాంతింగ్ చేసుకున్నాడు. దీంతో సన్నీ జెస్సీకి సపోర్ట్ చేశాడు. అతని వద్దే ఉన్నాడు. జెస్సీ హెల్త్ బాగోలేకున్నా.. షణ్ముక్, సిరి అతన్ని కనీసం పట్టించుకోలేదని మానస్‌తో సన్నీ వాపోయాడు. వారి మధ్యకు వెళ్లొద్దని మానస్ సజిషన్ ఇచ్చాడు. జెస్సీ బెడ్ పై కూర్చొని ఇబ్బంది పడుతున్నా.. కనీసం ఏమైందని కూడా షణ్నుక్ అడగలేదు. సీక్రెట్‌ టాస్క్‌ ఫెయిల్ అయినప్పటి నుండి వారిద్దరు జెస్సీని దూరంగా ఉంచుతున్నారని మానస్ చెప్పొకొచ్చాడు. దీని తర్వాత నామినేషన్ మొదలైంది.

ముందు మానస్.. శ్రీరాంను నామినేట్ చేస్తాడు. తర్వాత సంచాలకుడిగా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదని జెస్సీని సైతం నామినేట్ చేసేశాడు. గొడవలొద్దంటూనే మానస్, సన్నీని సైతం నామినేట్ చేశాడు శ్రీరాం. ఇక ఆ తర్వాత కాజల్ ను, మానస్ ను రవి నామినేట్ చేశాడు. సిరి- సన్నీని, యానీని.. జెస్సీ- సన్నీని, మానస్‌ ను.. సన్నీ- జెస్సీని, సిరి ని నామినేట్ చేశారు.

చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు వెళ్లిపోవాలంటుంటే వీక్ గా ఉండే వారు సైతం ఇంట్లో ఉందేందుకు అర్హలు కాదంటూ వాదించిన విశ్వ.. ముందు ప్రియాంకను తర్వాత మానస్ ను నామినేట్ చేశాడు. తర్వాత రవి, కాజల్ మధ్య మరో సారి ఆర్గ్యూమెంట్ జరిగింది. దీంతో ఆమె రవిని, శ్రీరాంను నామినేట్ చేసింది. యానీ.. కాజల్‌ను, సిరి నామినేట్‌ చేసింది. తర్వాత షణ్ముక్.. ప్రియాంక, మానస్‌‌ను నామినేట్‌ చేశాడు.

Bigg Boss 5 Telugu 58 episode-2

Bigg Boss 5 Telugu 58 episode-2

ఇక షణ్ముక్ ప్రియాంకు ఫ్రీ సజిషన్ ఇచ్చాడు. నీ గేమ్‌‌ను నువ్వే ఆడుకో.. అందరిలోకెళ్లా నువ్వు స్ట్రాంగ్‌గా అనిపిస్తావంటూ సజిషన్ ఇచ్చాడు. దీంతో పింకీ సీరియస్ అవుతూ నామినేట్ చేసిన తర్వాత ఇంకెవరు ఆడతారంటూ కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇక షణ్ముక్ పింకీకి ఫోం పూయబోతుండగా ఆ ప్లేట్ ను పింకీ తన ముఖానికి గట్టిగా కొట్టేసుకుంది.

తర్వాత మరో సారి సన్నీ, సిరి మధ్య గొడవ మొదలైంది. మానస్, సన్నీ సిరి విషయం మాట్లాడుకుంటుండగా అది విన్న సిరి.. సీరియస్ అయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ పడరు ఇక్కడ అంటూ క్లాస్ పీకింది. ఇక చివరికి సన్నీ, మానస్, శ్రీరాం, కాజల్, రవి ప్రియంక, యానీ, జెస్సీ, విశ్వ నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక తర్వాత ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే. మరి తర్వాత ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Tags

Latest News

Related News