Bigg Boss 5 Telugu 64 episode : విశ్వ ఎలిమినేట్.. వెళ్లేటప్పుడు అందరికీ షాక్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాడంటే..

Bigg Boss 5 Telugu 64 episode : ఈ వారం సండే ఎపిసోడ్ చాలా డిఫరెంట్‌గా సాగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ సభ్యులతో వెరైటీ గేమ్స్ ఆడించారు. బొమ్మ అక్కడ పాట ఇక్కడ అనే ఆటకు జెస్సీ సంచాలకుడిగా వ్యవహరించాడు. సన్నీ, కాజల్, విశ్వ, షణ్ముక్, ప్రియాంక ఒక టీంగా అనంతరం శ్రీరామ్, సిరి, మానస్, రవి, యానీ మరో టీంగా ఏర్పడ్డారు. ఇక గేమ్ లో భాగంగా ఫస్ట్ విశ్వ, […].

By: jyothi

Published Date - Mon - 8 November 21

Bigg Boss 5 Telugu 64 episode : విశ్వ ఎలిమినేట్.. వెళ్లేటప్పుడు అందరికీ షాక్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాడంటే..

Bigg Boss 5 Telugu 64 episode : ఈ వారం సండే ఎపిసోడ్ చాలా డిఫరెంట్‌గా సాగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ సభ్యులతో వెరైటీ గేమ్స్ ఆడించారు. బొమ్మ అక్కడ పాట ఇక్కడ అనే ఆటకు జెస్సీ సంచాలకుడిగా వ్యవహరించాడు. సన్నీ, కాజల్, విశ్వ, షణ్ముక్, ప్రియాంక ఒక టీంగా అనంతరం శ్రీరామ్, సిరి, మానస్, రవి, యానీ మరో టీంగా ఏర్పడ్డారు. ఇక గేమ్ లో భాగంగా ఫస్ట్ విశ్వ, రవి ఎంట్రీ ఇచ్చారు. వీరికి అల వైకుంఠపురంలో మూవీకి సంబంధించిన బొమ్మలను చూపించారు. వీటికి రవి కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో విశ్వ ఓడిపోయాడు.

తర్వాత మరో పిక్చర్ చూపించినప్పుడు షణ్ముక్ గంట కొట్టాడు కానీ ఆన్సర్ చెప్పలేకపోయాడు. దీంతో వారి టీం మైనస్ లోకి వెళ్లింది. ఈ గేమ్ తర్వాత ఇంకో గేమ్ కండక్ట్ చేశాడు నాగార్జున. దాని పేరు నేనెవరిని. ఓ కంటెస్టెంట్‌కు వేరే కంటెస్టెంట్ పేరు వస్తుంది. ఇలా వచ్చిన పేరుకు సంబంధించిన వారు వారిని ఇమిటేట్ చేయాలి. వారి ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారో మిగతా కంటస్టెంట్స్ గెస్ చేసి చెప్పాలి.

ఇక ఈ టాస్క్ పూర్తయిన తర్వాత చివరకు విశ్వ ఎలిమినేట్ అయ్యాడు అని తెలియగానే అందరూ షాక్ అవుతారు. ఇక విశ్వ వెళ్లిపోతున్నాడని తెలిసి శ్రీరాం, యానీ మాట్లాడుకుంటారు. ఇక బయటకు వచ్చేసిన విశ్వ కాస్త ఎమోషనల్ అవుతాడు. అయితే ఇంట్లో ఉన్న సభ్యులకు ర్యాంకులు ఇవ్వాలని బిగ్ బాస్ విశ్వకు టాస్క్ ఇస్తాడు.

Bigg Boss 5 Telugu 64 episode-2

Bigg Boss 5 Telugu 64 episode-2

మొదటగా ప్రియాంకకు పదవ ర్యాంక్ ఇస్తాడు విశ్వ. అందుకు గల కారణాలను సైతం చెబుతాడు. తర్వాత తొమ్మిదవ ర్యాంకును కాజల్ కు ఇస్తాడు. ఎందుకంటే ఆటలో ఆమె తనపై నమ్మకాన్ని కోల్పోతున్నదని వివరిస్తాడు. ఇక జెస్సీని ఎనిమిదో ర్యాంకులో ఉంచి యానీ మాస్టర్ ను ఏడో ర్యాంకుకు పరిమితం చేస్తాడు. ఇక తర్వాత మానస్ కు ఆరో ర్యాంకు ఇచ్చి, సిరికి ఐదవ ర్యాంకు ఇస్తాడు. సన్నీకి నాల్గవ ర్యాంకు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఇక షణ్ముక్ కు మూడవ ర్యాంక్ ఇచ్చి అతన్ని పొగిడాడు విశ్వ.

తర్వాత రవిని అందరూ నెగెటివ్ యాంగిల్ లో చూస్తారని అది కాదని అతని ఆలోచన బాగుంటుందని చెబుతూ అతనికి రెండో ర్యాంకు ఇస్తాడు. ఇక శ్రీరాం ను చూస్తూ ఉంటే తనకు చనిపోయిన తన తమ్ముడు గుర్తుకు వస్తున్నాడని చెబుతాడు విశ్వ. శ్రీరాం వ్యక్తిత్వం గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేశాడు. అతడు మనసులో ఏం ఉంటే అదే చెబుతాడు. నటించడం అతనికి రాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాడు. కాబట్టి అతనికి ఫస్ట్ ర్యాంకు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు.

Tags

Latest News

Related News