• Telugu News
  • movies

Bigg Boss 5 Telugu 80 episode : సన్నీకి చెక్ పెట్టిన సిరి.. చివరికి కెప్టెన్ ఎవరంటే..

Bigg Boss 5 Telugu 80 episode :  బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం కంటస్టెంట్స్ పోటీ పడుతున్నారు. రకరకాల ప్లాన్స్ వేస్తూ ఫస్ట్ రౌండ్‌లోనే సన్నీని సిరి పక్కకు పెట్టేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎవరైతే కెప్టెన్ అవుతారే వారే లాస్ట్ కెప్టెన్. ఇందులో పార్ట్ గా నియంత మాటే శాసనం అనే టాస్క్ ఇవ్వడంతో అందరూ హుషారుగా పాల్గొన్నారు. అయితే సౌండ్ మోగినప్పుడల్లా ఎవరైతే […].

By: jyothi

Updated On - Wed - 24 November 21

Bigg Boss 5 Telugu 80 episode : సన్నీకి చెక్ పెట్టిన సిరి.. చివరికి కెప్టెన్ ఎవరంటే..

Bigg Boss 5 Telugu 80 episode :  బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం కంటస్టెంట్స్ పోటీ పడుతున్నారు. రకరకాల ప్లాన్స్ వేస్తూ ఫస్ట్ రౌండ్‌లోనే సన్నీని సిరి పక్కకు పెట్టేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎవరైతే కెప్టెన్ అవుతారే వారే లాస్ట్ కెప్టెన్. ఇందులో పార్ట్ గా నియంత మాటే శాసనం అనే టాస్క్ ఇవ్వడంతో అందరూ హుషారుగా పాల్గొన్నారు.


అయితే సౌండ్ మోగినప్పుడల్లా ఎవరైతే సింహాసనం పై కూర్చుంటారో వారు ఆ రౌండ్‌లో సేఫ్ అవుతూ నియంత మాదిరిగా వ్యవహరిస్తుంటారు. ఇక మిగతావారు తమని తాను సేవ్ చేసుకునేందుకు ఒక ఛాలెంజ్‌లో పాల్గొనాలి. ఇందులో లాస్ట్ ప్లేస్ నుంచి ఎవరైతే ఇద్దరు ఉంటారో వారు నియంతతో మాట్లాడుకుని తమని తాము సేవ్ చేసుకోవడానికి ఒప్పించాలి.


వారిద్దరి మాటలు విన్నాక ఎవరిని పోటీలోంచి తొలగించాలి. ఎవరినీ కంటిన్యూ చేయాలని నియంత ఓ టాస్క్ ఇచ్చి డిసైడ్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ లో సింహాసనాన్ని సిరి చేజిక్కించుకుంది. ఇందులో సన్నీ, రవి లాస్ట్ రెండు ప్లేసుల్లో నిలిచారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే రవిని నెక్ట్ రౌండ్‌కు పంపింది సిరి. దీంతో సన్నీ కాస్త ఫీల్ అయ్యాడు.

Bigg Boss 5 Telugu 80 episode -2

Bigg Boss 5 Telugu 80 episode -2

రెండో రౌండ్‌లో సింహాసనాన్ని శ్రీరామ్ దక్కించుకున్నాడు. ఎవరైతే గోడపై ఎక్కువ ఎత్తులో చెప్పులు అతికిస్తారో.. వారు సేవ్ అయినట్టు. తక్కువ ఎత్తులో చెప్పులను అతికించిన ఇద్దరు సభ్యులు నియంత చెప్పినట్టు వినాలి. దీంతో రవి, కాజల్ చివరి స్థానాల్లో నిలిచారు. అయితే శ్రీరాం కాజల్ ను బాగా ఇబ్బంది పెట్టి రవిని నెక్ట్ లెవల్‌కు పంపించాడు. దీంతో కెప్టెన్ అయ్యే చాన్స్ మిస్ అయిందని కాజల్ ఎమోషనల్ అయింది.


తర్వాత మూడో సారి సింహాసనం రవికి దక్కింది. ఇందులో చివరి నుంచి రెండు స్థానాల్లో షణ్మక్, మానస్ ఉండటంతో షణ్మక్ ను నెక్ట్ లెవల్ కు పంపించాడు రవి. ఇక నాల్గో రౌండ్ లో ప్రియంక చేతికి సింహాసనం దక్కింది. ఇందులో శ్రీరామ్‌, షణ్ముఖ్ చివరి రెండు ప్లేస్‌లలో ఉన్నారు. వీరిలో షణ్ముక్ సేవ్ అయ్యాడు. ఇక ఐదో రౌండ్‌లో ఇందులో సిరినే ముందు సింహాజనంపై కూర్చున్నట్టు విజువల్స్ లో కనిపించింది. అయితే మానస్ మాత్రం ప్రియంకనే ముందు కూర్చున్నదని చెప్పడంతో సిరి హర్టయింది. అనంతరం ప్రియాంక ఏడ్చింది. దీంతో కెప్టెన్ గా ఎవరనే నిర్ణయం నెక్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. తర్వాత ఏం జరిగిందనేదే మరసటి ఎపిసోడ్‌లో చూద్దాం.

Tags

Latest News

Related News