Bigg Boss 5 Telugu, Episode 75:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో రానురాను గతి తప్పుతోందని పిస్తోంది. టాస్కులు కంప్లీట్ చేయడం ఏమో గానీ సిరి మహాతల్లి ఏకంగా A సర్టిఫికేట్ మూవీ చేసేస్తుందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్‌లో భాగమేనా? అని కొందరు డౌట్ పడుతుండగా.. సిరి మాత్రం షన్నూను అసలు వదలడం లేదు.
ఇక బిగ్‌బాస్ సీజన్ 75వ ఎపిసోడ్‌లో సభ్యులు వింత వింతగా ప్రవర్తించారు. ఎప్పటిలాగానే మానస్, ప్రియాంక తిట్టుకోవడం అలుగడం జరిగింది. ఇకపోతే సన్నీ మాత్రం రవి దగ్గరి నుంచి స్పెషల్ తీసుకుని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సన్నీకి స్పెషల్ పవర్ ఇచ్చిన రవి..
మొదట సన్నీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ పూర్తిచేస్తాడు. అయితే, టీ షర్ట్ సరిగా వేసుకోకుండా ఆడావని సభ్యులు అనడంతో సన్నీ అందుకు ఒప్పుకోడు. నేను ఈ గేమ్ ఆడనని మొండిగా ప్రవర్తించడంతో షణ్ముక్ ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత రవి తన వద్దనున్న పవర్‌ను సన్నీకి ఇవ్వడానికి ఇష్టపడతాడు.నాకు ఏ పవర్ వద్దంటూనే చివరకు తీసుకుంటాడు సన్నీ.. దీంతో మానస్, ఆనీ, శ్రీరామచంద్ర వీరిలో నుంచి ఒకరిని తప్పించి, ఆ స్థానంలో గోల్డ్ మైన్ చేసేందుకు ఈ పవర్ చాన్స్ ఇస్తుంది. దీంతో శ్రీరామ చంద్రను తప్పించి సన్నీ ఎంట్రీ ఇస్తాడు.
Bigg Boss 5 Telugu, Episode 75-1
ఆ తర్వాత ముళ్లు వేసే టాస్క్‌లో మానస్ ఓడిపోగా, ఆనీ గెలుస్తుంది. దీంతో ప్రియాంక, సిరి, ఆనీలు కెప్టెన్సీ కంటెండర్లుగా మారుతారు. ఇక మాథమెటికల్ టాస్క్లో 17 నెంబర్ల సాయంతో మొత్తంగా 143 వచ్చేలా నెంబర్ బోర్డులను తగిలించాలని బిగ్‌బాస్ చెప్పడంతో అందులో మానస్ గెలుస్తాడు. ఇకపోతే మానస్, ప్రియాంకలు గొడవ పడుతుండగా మరోవైపు సిరి షన్నూ మీద అలుగుతుంది. రేయ్ నేను ఏమన్నాను రా అంటాడు అమాయకంగా షన్నూ..
సిరి, షన్నూ ఏంటీ మీ రొమాన్స్.. మీ బెడ్ రూం అనుకున్నారా?
ఇద్దరి మధ్య గొడవ ఏంటో ప్రేక్షకులకు అస్సలు అర్థం కాలేదు. కానీ, కొంత సేపటికే సిరి వచ్చి షన్నూను గట్టిగా హగ్ చేసుకుంటుంది. వీరిద్దరూ అలా క్లోజ్‌గా ఉన్న సన్నివేశాన్ని బిగ్ బాస్ ఏకంగా బ్లర్ చేయించాడు అంటే వీళ్లు ఏ రేంజ్ లో రొమాన్స్ పండించారో అర్థం చేసుకోవచ్చని అంతా అనుకుంటున్నారు. అసలు ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా? మీ బెడ్ రూం అనుకుంటున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షన్నూ మీద పడి సిరి గట్టిగా లిప్ టు లిప్ ముద్దు పెట్టి ఉంటుందని, అందుకే ఆ సీన్ ఎవరూ చూడకుండా బిగ్ బాస్ బ్లర్ చేయించాడని అంతా భావిస్తున్నారు.