Bigg Boss-6 : బుల్లితెరపై బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ దేనికీ లేదు. అతిపెద్ద రియాల్టీ షోగా తెలుగు నాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేమ్ షో ఇది. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. లాస్ట్ టైమ్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది కూడా.
ఇవన్నీ దాదాపు పెద్ద హిట్టే అయ్యాయి. కానీ చివరి సారి బోల్డ్ కంటెంట్‌కు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆరో సీజన్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రీసెంట్ గా విడుదల చేశారు. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేయబోతున్నాడు. ఈ సారి గతంలో కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
సరికొత్త టాస్కులు ఉంటాయని సమాచారం. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. వారికోసం ఓ వార్త బయటకు వచ్చింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ షో వచ్చే నెల సెప్టెంబర్ 4 నుంచే ప్రారంభం కాబోతోందంట. ఈ విషయాన్ని మాటీవీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి ఈ ఆగస్టు చివరి ఆదివారం స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చేనెల మొదటి వారానికి పోస్టు పోన్ చేశారు. ఈ సారి బజ్ హోస్ట్ గా యాంకర్ శివ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సీజన్ లో 17 మంది కంటెస్టెంట్లు ఉంటారు. అందులో 15మందిని ఒకేసారి హౌస్ లోకి పంపి, మిగతా ఇద్దరిని వైల్డ్ కార్డుల ద్వారా పంపిస్తారని తెలుస్తోంది.
Read Also : Karthikeya 2 : ఉత్తరాదిన కార్తీకేయ 2 హవా.. కశ్మీర్ ఫైల్స్ తో పోలుస్తున్న ట్రేడ్ ఎనలిస్టులు
Read Also : N. T. Rama Rao Jr : టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎన్టీఆరే.. తేల్చేసిన తాజా సర్వే.. తర్వాత ఎవరంటే..?