Bigg Boss Season 6 : లేడీ కంటెస్టెంట్స్ తో వెంట్రుక‌లు పీకించిన బిగ్ బాస్.. ఇదేం చెండాలం..!

Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అప్పుడే నాలుగవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ఐదవ వారంలోకి అడుగు పెట్టింది.. అయితే ఈ షో ఈసారి సీజన్ అంతగా ఆకట్టుకోలేక పోతుంది...

By: jyothi

Published Date - Thu - 6 October 22

Bigg Boss Season 6 : లేడీ కంటెస్టెంట్స్ తో వెంట్రుక‌లు పీకించిన బిగ్ బాస్.. ఇదేం చెండాలం..!

Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అప్పుడే నాలుగవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ఐదవ వారంలోకి అడుగు పెట్టింది.. అయితే ఈ షో ఈసారి సీజన్ అంతగా ఆకట్టుకోలేక పోతుంది.. బిగ్ బాస్ అసలు రేటింగ్ పడిపోయి నిర్వాహకులను షాక్ కు గురి చేస్తుంది. దీంతో ఎలా టీఆర్పీ పెంచుకోవాలా అని బిగ్ బాస్ కసరత్తులు చేస్తుంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు టీఆర్పీ రేటింగ్ పెంచడం కోసం చెత్త చెత్త పనులు చేపిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ చేయించిన చెత్త పని గురించి అందరు విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులలో అమ్మాయిల చేత అబ్బాయిలకు చెత్త టాస్క్ ఇచ్చారు.. ఈ టాస్క్ చెప్పుకోవడానికి కూడా చెండాలంగా ఉంది..

దిక్కుమాలిన చెత్త టాస్క్..

హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ అయిన చలాకి చంటి, శ్రీహన్ లకు పనిష్ మెంట్ ఇచ్చే ప్రక్రియలోని ఇలాంటి దిక్కుమాలిన చెత్త టాస్క్ ఒకటి ఇచ్చినట్టు తెలుస్తుంది.. అది ఏంటంటే.. అబ్బాయిల బాడీలపై ఉండే వెంట్రుకలను వాక్స్ తో తీసేయాలి.. ఈ పని అమ్మాయిలు చేయించుకుంటూ ఉంటారు.. కానీ ఈ హౌస్ లో రివర్స్ లో అబ్బాయిలకు అమ్మాయిల చేత ఇలా చేయించారు..

ఈ టాస్క్ వింటేనే చెండాలంగా అనిపిస్తుంది. ఇక చూసిన జనాలు అయితే బూతులు తిడుతున్నారు. బిగ్ బాస్ చెప్పాడని ఈ పని చేయడానికి కొద్దిగా కూడా ఆలోచించకుండా శ్రీ సత్య, ఇనయా చంటి, శ్రీహన్ కాళ్లకు ఉన్న వెంట్రుకలను వాక్స్ ద్వారా తీసేసారు.. అసలు ఇలాంటి ఒక టాస్క్ అమ్మాయిలకు ఎలా ఇస్తారు అని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ చెత్త టాస్క్ అయినా టిఆర్పి రేటింగ్ పెంచుతుందో లేదో చూడాలి..

Read Also : Thailand Shooting: డే కేర్ సెంటర్ లో ఉన్మాది కాల్పులు.. 35 మంది మృతి

Read Also : Nandamunri Balakrishna : అన్‌స్టాపబుల్ 2 షోకి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరోస్ కి ఆహ్వానం

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News