Bigg Boss Telugu- 5, Episode 47 : బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్‌బాస్ సీజన్ -5 ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. 47-ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ కొత్త టాస్క్స్ ఇచ్చారు. లోబో రీ ఎంట్రీతో టీం సభ్యులు కొత్త జోష్‌లోకి వచ్చారు. సీక్రెట్ టాస్క్‌లో తాను ఓడిపోయానని తెలిసి షణ్ముఖ్ బాగా ఏడ్చేసి టీం సభ్యులను తిట్టిపోశాడు. నాకు ఏమీ రాదనే కాదా నన్ను మోసం చేశారని సిరి, జెస్సీలపై మండిపడ్డాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాలకు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
బంగారు కోడిపెట్ట టాస్క్ :
ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇవ్వగా.. మానస్‌కు స్పెషల్ పవర్ ఉన్న ఒక ఎరుపు రంగు ఎగ్ లభించింది. దీంతో అతను 5 గుడ్లను పొందాడు. అలాగే ‘కారంగా ఉన్న నూడుల్స్ తినాలి’అనే టాస్క్‌ను కూడా ఇచ్చారు. దీనికోసం మానస్‌తో మరొకరిని ఎంచుకుని ఈ ఆట ఆడాల్సి ఉంటుంది.
Bigg Boss Telugu- 5, Episode 47.. shanmukh get emotional
అప్పుడు మానస్ సన్నీని సెలెక్ట్ చేసుకోగా ఇద్దరు స్పైసీ నూడుల్స్ తినడంతో ఐదు గుడ్లను మానస్‌కు కైవసం చేసుకున్నాడు.కెప్టెన్సీ బరిలో నిలిచిన వారి కోసం ఇచ్చిన ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ తెలిపాడు. ఇందులో ఎక్కువ గుడ్లు సాధించిన మానస్, విశ్వ, రవి, శ్రీరామ్, సన్నీలు కెప్టెన్సీ బరిలో నిలిచారు. అయితే, సీక్రెట్ టాస్క్‌ను నిబంధనల ప్రకారం ఆడనందుకు జెస్సీని పోటీకి అనర్హుడిగా బిగ్‌బాస్ ప్రకటించాడు.
నన్ను మోసం చేశారని ఏడ్చేసిన షణ్ముఖ్..
జెస్సీ ఓడిపోవడంతో షణ్ముఖ్ తన సహనాన్ని కోల్పోయాడు. సిరి, జెస్సీలపై గట్టిగా అరిచాడు. జెస్సీకి సిరి హెల్ప్ చేయడాన్ని షణ్ముఖ్ తట్టుకోలేకపోయాడు. మిత్రుడు అని చెప్పి నన్ను మోసం చేశారు.. నేను ఎందుకు పనికి రాను.. నాకు ఆట ఆడటం కూడా రాదనే నన్ను ఎంపిక చేశారు. నన్ను ఇంట్లో అలానే చూస్తున్నారు. బయట కూడా అలానే చూస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇకపోతే లోబో రాకతో రవి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. రీ ఎంట్రీ ఇచ్చిన లోబోకు బిగ్ బాస్ ప్రత్యేక మైన అధికారం ఇచ్చాడు. బ్లాక్ మరియు బంగారం ఎగ్స్ ఇచ్చాడు. వీటితో కెప్టెన్సీ బరిలో నిలిచిన వారిలో ఒకరిని తొలగించి, ఇంకొకరిని కెప్టెన్సీ పోటీదారుగా సెలెక్ట్ చేయొచ్చు. అయితే, లోబో.. శ్రీరామ్‌ను పోటీదారుగా తప్పించి, కాజల్‌ను కెప్టెన్సీ అభ్యర్థిగా ప్రకటించాడు.