Bigg Boss Telugu 5, Episode 50: భార్య గ‌ర్భ‌వతి అంటూ ఏడ్చేసిన లోబో.. త‌న‌కు పుట్ట‌క‌పోయినా ఓ బాబు ఉన్నాడన్న సిరి

చాలా విచిత్రంగా ఉంది. బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్లు అడుగు పెట్టి 50 రోజులు పూర్తవుతున్నందున్న కంటెస్టెంట్లకు ప్రియమైన వారి దగ్గరి నుంచి లెటర్లు లభిస్తాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటో తెలుసుకోవాలంటే ముందు ఆర్టికల్ లోకి పదండి. పవర్ రూమ్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ల ముందు రెండు లెటర్లు పెట్టిన బిగ్ బాస్ అందులో ఒక్కరు మాత్రమే లెటర్ తీసుకుని మిగతా వారు సైలెంట్ […].

By: jyothi

Published Date - Tue - 26 October 21

Bigg Boss Telugu 5, Episode 50: భార్య గ‌ర్భ‌వతి అంటూ ఏడ్చేసిన లోబో.. త‌న‌కు పుట్ట‌క‌పోయినా ఓ బాబు ఉన్నాడన్న సిరి

చాలా విచిత్రంగా ఉంది. బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్లు అడుగు పెట్టి 50 రోజులు పూర్తవుతున్నందున్న కంటెస్టెంట్లకు ప్రియమైన వారి దగ్గరి నుంచి లెటర్లు లభిస్తాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటో తెలుసుకోవాలంటే ముందు ఆర్టికల్ లోకి పదండి.

పవర్ రూమ్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ల ముందు రెండు లెటర్లు పెట్టిన బిగ్ బాస్ అందులో ఒక్కరు మాత్రమే లెటర్ తీసుకుని మిగతా వారు సైలెంట్ గా ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇలా లెటర్ అందుకోలేని వాళ్లు ఎలిమినేట్ అయినట్లు లెక్క అని పేర్కొన్నాడు. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి లోబో, పింకీల లేఖలు అందాయి. లోబో పింకీ కోసం తన లేఖను త్యాగం చేసి గుక్క పెట్టి ఏడ్చేశాడు. తర్వాత వెళ్లిన షణ్ముక్ రవిలకు విశ్వ సిరిల లెటర్లు వచ్చాయి. విశ్వ కోసం తన లెటర్ ను సిరి త్యాగం చేసింది. సిరికి తన లవర్ అయిన శ్రీహాన్ దగ్గరి నుంచి లెటర్ రాగా.. విశ్వ కోసం త్యాగం చేసింది. విశ్వ కు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న తపన ఉంటుందని బోరున విలపించింది.

పవర్ రూంలోకి వెళ్లిన పింకీ కాజల్ లకు యానీ మాస్టర్ మానస్ ల లేఖలు అందాయి. కానీ యానీ మాస్టర్ పరిస్థితిని అర్థం చేసుకున్న మానస్ తన లెటర్ ను ముక్కలు చేశాడు. మానస్ అలా లెటర్ చింపేసేటపుడు పింకీ మాత్రం చాలా బాధపడింది. మరో ఇద్దరు కంటెస్టెంట్లు విశ్వ–లోబో లోపలికి వెళ్లగా వారికి రవి శ్రీరామ్ ల లేఖలు అందాయి. మొదట శ్రీరామ్ రవి కోసం తన లెటర్ ను త్యాగం చేయడానికి సిద్ధపడగా.. లోబో రిక్వెస్ట్ తో రవి కూడా శ్రీరామ్ కోసం త్యాగం చేశాడు. దీంతో తనకు వచ్చిన లెటర్ ను చించేసిన రవి శ్రీరామ్ లెటర్ ను చదివి వినిపించాడు. దీంతో ఫుల్ ఎమోషనల్ అయిన శ్రీరామ్ బిగ్గరగా ఏడ్చేశాడు. తర్వాత లెటర్ చేతిలో పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ కు మరో కంటెస్టెంట్ పింకీ హగ్గిచ్చి, ముద్దులు పెట్టింది.

Bigg Boss Telugu 5, Episode 50-1

Bigg Boss Telugu 5, Episode 50-1

అటు తర్వాత లోపలికి వెళ్లిన యానీ మాస్టర్ సిరిలకు కాజల్ షణ్ముక్ లెటర్స్ వచ్చాయి. దీంతో కాజల్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఇది చూసి షణ్ముక్ కాజల్ నే లెటర్ తీసుకోమన్నాడు. కానీ సిరి మాత్రం షణ్నును తీసుకోవాలని పట్టుబట్టింది. అయినా వినని షణ్ను తన లెటర్ చింపి కాజల్ ను లెటర్ అందుకోమన్నాడు. కానీ షణ్ను తీవ్రంగా ఏడ్చేశాడు.

మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..

ఈ లెటర్ల ప్రక్రియలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ సన్నీ చేతిలో లెటర్ పెట్టి జెస్సీకి అందిచమన్నాడు. కానీ ఇక్కడే ఓ మెలిక ఉందన్నాడు. జెస్సీ సేవ్ అయి లెటర్ అందుకోవాలంటే ఆల్రెడీ లెటర్ అందుకున్న వారిలో నుంచి ఎవరైనా ఒకరు ఎలిమినేట్ కావాలని కండీషన్ పెట్టాడు. అందుకోసం శ్రీరామ్ తనను తాను నామినేట్ చేసుకునేందుకు సిద్ధపడిపోయాడు. అటు తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు. మొత్తం మీద ఈ వారం నామినేషన్ లో రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముక్, మానస్ ఉన్నారు.

Tags

Latest News

Related News