Bigg Boss Telugu 5, Episode 60 : తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రోజురోజుకూ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయమై గొడవలు, ప్యారలల్ ట్రాక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. తాజా ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకుందాం..
బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు, ఇతర పనులు చేయడం మరిచి పింకీ మానస్ ధ్యాసలో ఉండిపోయేందని అభిప్రాయాలు పలువురి మనసులో ఉండగా, ఆ మాటలను సన్నీ పింకీకి డైరెక్ట్‌గా చెప్పేశాడు. ఈ మాటలకు మానస్ స్పందించాడు. పింకీ ఎవరి మాటా వినదనీ, తాను చేయాలనుకున్నదే చేస్తుందని అంటాడు. అయితే, తాను పింకీ గేమ్ అస్సలు డిస్ట్రబ్ చేయడం లేదని పేర్కొన్నాడు మానస్.
జెస్సీ మాత్రం హాయిగా తనకు మెడలు నొప్పిలేస్తున్నాయని రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ వింత కోరిక కోరాడు జెస్సీ. తనకు రెండు వైపులా సిరి, ప్రియాంక ఉండగా, వారిద్దరిని కలిసి ఒక ముద్దు ఇవ్వాలని అడుగుతాడు. ఆ మాటలు విని సిరి షాక్ అవుతుంది. ఏంటీ ముద్దులు పెట్టాలా? అని వారు అడుగుతారు కూడా. అయితే, అందుకు వాళ్లు ఒప్పుకోరు.అలా వారు ముద్దులకు నో చెప్పడంతో జెస్సీ వాళ్లిద్దరూ తన బేబీలను అంటాడు.
Bigg Boss Telugu 5, Episode 60
ఇక నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ షురూ కాగా, అందులో హౌస్ మెంబర్స్ రెండు టీమ్‌లుగా డివైడ్ అయి పోటీలో పాల్గొంటారు. యానీ, జెస్సీ, రవి, సన్నీ, సిరి నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్ టీమ్స్‌గా ఉండగా, మిగతా వారంతా ఎర్రగులాబీలను ఎంచుకుని సూపర్ హీరోస్ టీమ్‌గా ఉండిపోతారు. ఆపోజిట్ టీంలోని మెంబర్స్ ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. ఈ క్రమంలోనే గేమ్ స్టార్ట్ కాగా, హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియా బాక్స్ కీస్ ఓపెన్ చేస్తుంది. అది చూసిన విలన్స్ టీమ్ విశ్వ వెంటనే వచ్చి తన టీమ్ వైపు ఉన్న డోర్ కీస్ తెరిచి హౌస్‌లోకి వెళ్తాడు. ప్రియాంక అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అప్పటికే విశ్వ స్టోర్ రూమ్‌లోకి వెళ్తాడు. ఈ క్రమంలోనే తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నాడని పింకీ ఫైర్ అవుతుంది. విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇస్తుంది పింకీ.
ఇక నెక్స్ట్ రౌండ్‌లో విచిత్ర జ్యూస్‌లు తాగే టాస్క్ ఇవ్వగా, హీరోల టీమ్ నుంచి శ్రీరామ్ సెలక్ట్ అవుతాడు. శ్రీరామ్ టాస్కులన్నిటినీ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి హీరోల టీమ్‌కు పాయింట్స్ తెస్తాడు. పింకీ తనను తోసేసిందని సిరి ఆరోపించగా, లేదని పింకీ అంటుంది.. ఈ క్రమంలోనే ఇద్దరిదీ తప్పేనని షణ్ముక్ జస్వంత్ అంటాడు. ఇక ఆ తర్వాత విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేస్తాడు షణ్ను. అయితే,రవి టాస్కులన్నీ పూర్తి చేస్తాడు. రవికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ అటువంటి టాస్కులు ఎలా ఇస్తారంటూ యానీ మాస్టర్ ఫైర్ అవుతుంది. మొత్తంగా రవి తన టీమ్ ను గెలిపించుకునేందుకుగాను బాగానే కష్టపడ్డాడని చెప్పొచ్చు.