Bigg Boss Telugu 5, Episode 61 : ప్రియాంకకు ముప్పుతిప్పలు.. అండర్ వేర్స్ తీయకపోవడమే సిరి క్యారెక్టర్ అని చెప్పిన షణ్ముక్.. చివరకు..

Bigg Boss Telugu 5, Episode 61 : బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ప్రస్తుతం మినీ యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ రెండు టీమ్‌లుగా డివైడ్ అయి టాస్కులు పూర్తి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్‌లో యాంకర్ రవికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కఠినతరమైన టాస్కులు ఇవ్వడం పట్ల యానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోస్ […].

By: jyothi

Published Date - Fri - 5 November 21

Bigg Boss Telugu 5, Episode 61 : ప్రియాంకకు ముప్పుతిప్పలు.. అండర్ వేర్స్ తీయకపోవడమే సిరి క్యారెక్టర్ అని చెప్పిన షణ్ముక్.. చివరకు..

Bigg Boss Telugu 5, Episode 61 : బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ప్రస్తుతం మినీ యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ రెండు టీమ్‌లుగా డివైడ్ అయి టాస్కులు పూర్తి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఎపిసోడ్‌లో యాంకర్ రవికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కఠినతరమైన టాస్కులు ఇవ్వడం పట్ల యానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోస్ టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే అవకాశం విలన్స్ టీమ్‌కు వచ్చింది. దాంతో వారు టార్గెట్ పర్సన్‌గా ప్రియాంక సింగ్‌ను ఎంపిక చేసుకున్నారు. అయితే, ప్రియాంక సింగ్ విలన్స్ టీమ్ వారు చెప్పిన టాస్కులన్నీ పూర్తి చేసేస్తుంది.

ఈ క్రమంలోనే తనతో ఏదేని సమస్య ఉంటే తనకు డైరెక్ట్‌గా సిరి షణ్ముక్ జస్వంత్‌ను అడుగుతుంది. అప్పుడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక చెప్తానని అనగా, అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదని సరి అంటుంది. మరో పక్కన షణ్ముక్ జస్వంత్ జెస్సీని తన టీమ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఎప్పటిలాగే క్షమాపణ చెప్పి, పది గుంజీలు తీస్తాడు. అందరికీ వినబడేలాగా సారీ అని గట్టిగా చెప్పడంతో సిరి కూల్ అవుతుంది. వెళ్లి షణ్ముక్ జస్వంత్‌ను కౌగిలించుకుంటుంది కూడా.

Bigg Boss Telugu 5, Episode 61

Bigg Boss Telugu 5, Episode 61

కాజల్ గార్డెన్ ఏరియాలో పెట్టిన బాక్స్ తాళాలు ఓపెన్ చేయకుండా ఉండేందుకుగాను అందులో గోధుమ పిండితో నింపుతుంది. దాంతో ఇలా చేయడం సరికాదని, ఇటువంటి థాట్స్ మాకు రావా అంటూ కాజల్‌పై సరి ఫైర్ అవుతుంది. ఈ సందర్భంలోనే ‘బిగ్ బాస్’ ఇరు టీమ్‌లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఒక టీమ్‌లోని వ్యక్తిని మరొక వ్యక్తితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. ఈ స్వాప్ విషయమై చర్చిస్తున్న సందర్భంలో షణ్ముక్ జస్వంత్, సన్నీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విలన్స్ టీమ్‌లోని యానీ మాస్టర్ ఆమెకు వరుసగా కఠినమైన టాస్కులు ఇస్తారు. వాటన్నిటినీ పూర్తి చేస్తుంది యానీ మాస్టర్.
ఇక ఆ తర్వాత విలన్స్ టీమ్ వారు రాక్షసులుగా మారి హౌస్‌లోని ఐటమ్స్ అన్నిటినీ చిందరవందర చేస్తారు.

కెప్టెన్ షణ్ముక్ జస్వంత్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని సిరిని అడుగుతాడు షణ్ముక్. దాంతో అండర్ వేర్స్ సర్దుతానని అంటుంది సిరి. అయితే, తనకు రెండు నిమిషాలు టైం కావాలని, తన వేళ్లు పని చేయడం లేదని సర్ది చెప్తుంది. ఈ క్రమంలోనే షణ్ముక్ జస్వంత్ అండర్ వేర్స్ తీయకపోవడే సిరి క్యారెక్టర్ అని నోరు జారుతాడు. దాంతో సిరి చాలా బాధపడుతూ, వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ క్రమంలోనే ఒకరి బాధను చూసి కామెడీ చేయొద్దని మానస్ అంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Tags

Related News