Bigg Boss Telugu 5, Episode 70: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ యమ రంజుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ తగ్గుతున్న కొద్దీ ఉన్న వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
గత ఎపిసోడ్‌లో సన్నీ తన గురించి ఇష్టమొచ్చినట్లు వాగాడని సిరి బాగా బాధపడిపోయింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌ను పట్టుకుని బాగా ఏడ్చేసింది. అయితే, అలా చేస్తున్న క్రమంలోనే సన్నీపైన కోపాన్ని, మరో పక్క షణ్ముక్‌పైనున్న ప్రేమను బయట పెట్టేసింది. షణ్ముక్‌ను గట్టిగా కౌగిలించుకున్న మాదిరిగానే పట్టుకుని హగ్గులిస్తూ ఐ లవ్ యూ చెప్పేసింది. ఇక యానీ మాస్టర్ కాజల్ పేరు తీస్తేనే పాము మాదిరిగా బుసలు కొడుతోంది. తాను ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్నంత వరకు అస్సలు ఆమెతో మాట్లాడబోనని నిర్ణయించుకుంది.
మరోవైపున మానస్, పింకీ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. ఓ టాస్కులో గెలిచినందుకుగాను ప్రియాంక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆటోగ్రాఫ్ అందుకుంది. సీక్రెట్ రూంలో ఉన్న జెస్సీ తన బాడీ బాగా వెయిట్ ఎక్కుతుందని, చూపు షేక్ అవుతుందని బాధపడుతుంటాడు. దాంతో డాక్టర్స్ అతడిని పరీక్షించిన ట్రీట్మెంట్ అవసరమని పేర్కొంటారు. ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హైస్ మెంబర్స్‌తో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు.
Bigg Boss Telugu 5, Episode 701
ఇక ఎఫ్ఐఆర్ గేమ్‌లో తొలుత యానీ మాస్టర్ కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా, నాగార్జున ముందు నాగిణి డ్యాన్స్ చేస్తూనే కాజల్‌ను యానీ వెక్కిరిస్తుంది. కంటెస్టెంట్స్ అందరూ యానీ మాస్టర్ కే సపోర్ట్ చేశారు. సన్నీపై రవి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. ఆ తర్వాత సిరిని బోనులో నిలబెట్టి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. కాజల్, మానస్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని చెప్పారు. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటికీ అది వీగిపోయింది.
ఇకపోతే ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడతానని, యూట్యూబ్ వరకే అని పేర్కొనడం నచ్చలేదని అంటూ సన్నీనని బోనులో షణ్ముక్‌ను నిలబెట్టారు. అయితే, మెజారిటీ కంటెస్టెంట్స్ షణ్ముక్ గుడ్ ప్లేయర్ అని పేర్కొనడంతో పాటు అతడిని సమర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున కాజల్, యానీ మాస్టర్‌కు చురకలంటించినట్లు చేశాడు. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేయడంతో పాటు అతడు ఫీల్ అయ్యేలా చేశారు చివరకు సన్నీ సేవ్ అయినట్లు నాగ్ తెలపడంతో అతడు హ్యాపీ అయ్యాడు.