Bigg Boss Telugu 5, Episode 72 : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ అప్పుడే 11 వ వారంలోకి ఎంటరైంది. 19 మందితో స్టార్ట్ అయిన ఈ షో ప్రజెంట్ 9 మందితో రన్ అవుతోంది. ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు, గేమ్ విషయమై విభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
11వ వారం నామినేషన ప్రక్రియ రసవత్తరంగా సాగింది. జెస్సీ వెళ్లిపోయినప్పుడు తనకు ఏడుపు రాలేదని, వీళ్లందరికీ ఎలా వచ్చింది? ఎందుకు డ్రామాలు చేస్తున్నారో అని హౌస్‌మేట్స్‌ను షణ్ముక్ విమర్శించాడు. ఈ క్రమంలోనే రవి.. సన్నీ ఇంతవరకు సిరి, షణ్నుకు సారీ చెప్పలేదని యానీతో చెప్పాడు. ఇక గిల్టీ బోర్డును మెడలో వేసుకున్న సన్నీ హౌస్‌మేట్స్ గురించి మానస్, కాజల్‌తో మాట్లాడాడు. యానీ మాస్టర్ అనకొండ, సిరి కట్లపాము, షణ్ముఖ్ నల్లతాచు అని పేర్లు పెట్టాడు. రవికి మాత్రం నటరాజ్ మాస్టర్ ఇచ్చిన గుంటనక్కే సరిగ్గా సరిపోతుందని అన్నాడు. తాను మంకీ లేదా చింపాంజీనని చెప్పుకొచ్చాడు రవి. పదకొండ వారం నామినేషన్ ప్రక్రియ తర్వాత స్టార్ట్ అయింది.
ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాగానే కెప్టెన్ రవి.. సన్నీని, కాజల్‌ను నామినేట్ చేశాడు. యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కాజల్‌ను నామినేట్ చేశాడు. మానస్. షణ్ముక్, యానీ మాస్టర్‌ను నామినేట్ చేయగా, తనను నామినేట్ చేయడం పట్ల యానీ మాస్టర్ అసహనం వ్యక్తం చేసింది.
Bigg Boss Telugu 5, Episode 72 s
ప్రియాంక సింగ్.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. సన్నీ.. శ్రీరామ్‌తో పాటు సిరిని నామినేట్ చేశాడు. అనంతరం యానీ మాస్టర్ వంతు వచ్చింది. ఆమె పలు విషయాలను గురించి చర్చించింది. హగ్ పాయింట్‌ను బయటకు తీసుకువచ్చి నామినేట్ చేయడం నచ్చలేదంటూ మానస్ తలపై బాటిల్ గుమ్మరించింది. ఆ తర్వాత కాజల్‌ను నామినేట్ చేస్తూ వెటకారం చేసింది.
అలా వెక్కిరించడం అస్సలు ఎగతాళి చేయడం కిందకు రాదని, అలా ఎగతాళి అంటారని కాని అగౌరవపర్చడం అంటారని కాని ఎవరితోనైనా అనిపిస్తే తాను కాళ్లు మొక్కుతానని, సాష్టాంగ నమస్కారం చేస్తానని కాజల్‌తో యానీ మాస్టర్ శపథం చేసింది. కాజల్, యానీ మాస్టర్ మధ్య అలా మాటల యుద్ధమే జరిగింది. మొత్తంగా పదకొండో వారం కంటెస్టెంట్స్‌లో కెప్టెన్ రవి మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉండటం గమనార్హం. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ విభేదాలు ఇలా తారాస్థాయికి చేరుకోవడాన్ని బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.