Bigg Boss Telugu 5, Episode 77: షన్నూతో రొమాన్స్‌పై ఓపెన్ అయిన సిరి.. తప్పని తెలుసు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటూ..!

Bigg Boss Telugu 5, Episode 77: బిగ్ బాస్ షోలో ఆటలు, టాస్క్‌ల సంగతి పక్కన పెడితే రొమాన్స్ పెరిగిపోతుంది. ముద్దులు, హగ్గులు మితిమీరిపోయాయి. ఇదే విషయంపై 77వ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సభ్యులందరిని ప్రశ్నించారు. ముందు సిరిని కన్ఫెషన్ రూంకు పిలిచి నీకు షన్నూకు మధ్య ఏం జరుగుతోందని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో దాని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. లాస్ట్ ఎపిసోడ్‌లో ఎవిక్షన్ పాస్ కోసం కాజల్ సభ్యులను […].

By: jyothi

Updated On - Sun - 21 November 21

Bigg Boss Telugu 5, Episode 77:  షన్నూతో రొమాన్స్‌పై ఓపెన్ అయిన సిరి.. తప్పని తెలుసు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటూ..!

Bigg Boss Telugu 5, Episode 77: బిగ్ బాస్ షోలో ఆటలు, టాస్క్‌ల సంగతి పక్కన పెడితే రొమాన్స్ పెరిగిపోతుంది. ముద్దులు, హగ్గులు మితిమీరిపోయాయి. ఇదే విషయంపై 77వ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సభ్యులందరిని ప్రశ్నించారు. ముందు సిరిని కన్ఫెషన్ రూంకు పిలిచి నీకు షన్నూకు మధ్య ఏం జరుగుతోందని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో దాని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..

లాస్ట్ ఎపిసోడ్‌లో ఎవిక్షన్ పాస్ కోసం కాజల్ సభ్యులను పిచ్చోళ్లను చేసి సన్నీకి ఇప్పించడంపై సిరి, ఆనీ మాస్టర్ మండిపడ్డారు. ఇక ఎవిక్షన్ పాస్ పొందిన సన్నీకి సరైన టైంలో పవర్ ఇస్తానని అంటాడు బిగ్ బాస్. మరుసటి రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకునే టైంలో బంగారం, బొగ్గు అనే టాస్క్ ఇచ్చి రవితో ఓ ఆట ఆడిపిస్తాడు బిగ్ బాస్..


సిరి, షన్నూకు క్లాస్ పీకిన నాగార్జున

టాస్కులు అన్ని పూర్తయ్యాక నాగార్జున ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూంకు పిలుస్తాడు. ముందుగా సిరిని పిలిచి ఏంటీ నీ బాధ? ఎందుకు తల బాదుకున్నావ్ అనడంతో నేను కొంచెం ఎమోషనల్, ఎవరినీ హార్ట్ చేయను, నాది నేను బాధపడుతానని అంటుంది సిరి.

Bigg Boss Telugu 5, Episode 77-2

Bigg Boss Telugu 5, Episode 77-2

మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఎందుకు వస్తుందో నాకు తెలియడం లేదు. ఇది తప్పో రైటో కూడా తెలీదు, అయినా చేసేస్తున్నా అని అనడంతో.. ఏం చేశావ్ అని నేను అడుగను..నువ్ ఇంకోసారి ఇలా గాయపర్చుకోవద్దని అంటాడు నాగ్. తర్వాత షన్నూ లోనికి వెళ్లగా.. సిరి అలా అవ్వడానికి ఎవరిది తప్పు అని అడుగగా నాదే అంటాడు షన్నూ.. ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదని సీరియస్ అవుతాడు నాగ్.


ఇక మానస్‌ గేమ్ బాగానే ఆడుతున్నావ్ కానీ, ప్రియాంక విషయంలో ఏం జరుగుతోంది. తను నీకు దగ్గరవుతుందని పిస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావ్ అని అడుగుతాడు. ఏదైనా అవ్వొచ్చు. నిర్మోహ మాటంగా తనకు నీ వర్షన్ చెప్పు.. లేదంటే అది ఎక్కడికో దారి తీస్తుందని నాగ్ సలహా ఇస్తాడు.


శ్రీరామ చంద్ర సేఫ్.. ఆనీ మాస్టర్‌కు గండం..

ఆ తర్వాత ఆనీ మాస్టర్‌ లోనికి వెళ్లగా కాజల్ మ్యాటర్‌లో నీ ఇమిటేషన్ స్థాయి దాటిపోతోందని చురకలు అంటించాడు నాగార్జున. తనలో చైల్డీష్ బిహేవియర్ ఉందని కవర్ చేసుకుని, మరోసారి ఇలా చేయనని అంటుంది ఆనీ. ఇక తరువాత శ్రీరామచంద్ర సేఫ్ అయినట్టు ప్రకటిస్తాడు నాగ్.. చివరగా సన్నీ కూడా సేఫ్ అని టీ షర్ట్ ద్వారా ప్రకటించాడు నాగ్. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఉందని లీకులు వచ్చాయి. కానీ చూద్దాం ఏం జరుగుతుందో..

Tags

Related News