• Telugu News
  • movies

Bigg Boss Telugu 5, Episode 78:  ఆనీ మాస్టర్ ఔట్.. షన్నూ, సిరి సీక్రెట్ రిలేషన్ గురించి ఏం చెప్పిందంటే..?

Bigg Boss Telugu 5, Episode 78: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారంతో పదకొండు వారాలు గడిచాయి. ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇవాళ హౌస్ నుంచి ఆనీ మాస్టర్ బయటకు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ సభ్యుల గురించి, ముఖ్యంగా సిరి, షన్నూల గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. బిగ్‌బాస్ ఇంట్లో ఆదివారం పెద్దగా సందడి లేకుండా సాగింది. ‘అనుభవించు రాజా’మూవీ టీం సభ్యులు వచ్చి హౌస్‌లో కాస్త రచ్చ […].

By: jyothi

Updated On - Mon - 22 November 21

Bigg Boss Telugu 5, Episode 78:  ఆనీ మాస్టర్ ఔట్.. షన్నూ, సిరి సీక్రెట్ రిలేషన్ గురించి ఏం చెప్పిందంటే..?

Bigg Boss Telugu 5, Episode 78: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారంతో పదకొండు వారాలు గడిచాయి. ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇవాళ హౌస్ నుంచి ఆనీ మాస్టర్ బయటకు వెళ్లింది. వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ సభ్యుల గురించి, ముఖ్యంగా సిరి, షన్నూల గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


బిగ్‌బాస్ ఇంట్లో ఆదివారం పెద్దగా సందడి లేకుండా సాగింది. ‘అనుభవించు రాజా’మూవీ టీం సభ్యులు వచ్చి హౌస్‌లో కాస్త రచ్చ చేశారు. ఈ టీంలో హీరో రాజ్ తరుణ్, సుదర్శన్, హీరోయిన్ కశిష్ ఖాన్ రావడంతో ఇళ్లంతా సందడిగా మారింది. వీరికి బొమ్మలు గీసే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ముందుగా సభ్యులను రెండు బృందాలుగా విడగొట్టారు.


కాజల్ సేఫ్.. చప్పట్ల రౌండ్

సభ్యులకు ముందుగా ఒకరినొకరు ప్రశ్నించుకునే టాస్క్ ఇవ్వగా అందులో అందరూ ప్రశ్నించుకుంటారు. ప్రశ్నలు అడిగే టాస్క్‌లో బాగా ఆడినందుకు గాను స్లైట్ గ్రీన్ కలర్ రావడంతో కాజల్ సేఫ్ అని నాగార్జున ప్రకటిస్తారు. ఆ తర్వాత డైలాగ్ కొట్టు రౌండ్ ప్రారంభం అవ్వగా ఇందులో సభ్యులందరూ బాగా పార్ఫామ్ చేస్తారు. దీనికి ముందు అనుభవించు రాజా టీంతో సభ్యులు రచ్చ చేయగా కాసేపు చిట్ చాట్, గేమ్స్, అల్లరి తర్వాత వాళ్లంతా వెళ్లిపోతారు.

Bigg Boss Telugu 5, Episode 78-1

Bigg Boss Telugu 5, Episode 78-1

డైలాగ్ కొట్టు రౌండ్ అందరికీ ఒక్కో డైలాగ్స్ చెబుతుంటారు. సిరి, షన్నుల హగ్స్ గురించి శ్రీ రామచంద్ర కౌంటర్స్ వేస్తూ.. ఏమో సర్ నాకు కనపడదు అని అంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్‌ను షన్నూకు సిరి ఇస్తుంది. దీనిని బట్టి మనం హగ్స్ తగ్గించుకుంటే ఇద్దరికీ మంచిదని సిరి అనడంతో.. అబ్బా ఎంత కరెక్ట్‌గా చెప్పావ్ సిరి అంటూ నాగ్ కౌంటర్ వేస్తాడు. హెల్మెట్స్, లైట్లు అంటూ సిరి సేఫ్ అని నాగ్ ప్రకటించారు.


ఆనీ మాస్టర్ షన్నూ,సిరి గురించి ఏం చెప్పిందంటే..

ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ రౌండ్‌లో టాప్ -3లో రవి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. శ్రీరామచంద్ర నా తమ్ముడు లాంటి వాడు, నాకు అవసరమైనప్పుడు నాతోనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇక షన్నూతో తనకు పెద్దగా కనెక్షన్ లేకపోయినా అతని మాటల్లో ఒక నిజం ఉంటుంది. నిజాయితీ కనిపిస్తుందని తెలిపింది. సిరి మాత్రం పటాక టాస్కులు బాగా ఆడుతుందని మెచ్చుకుంది. షన్నూ సిరిల మధ్య ఏం జరిగినా వీరిద్దరూ బాగా ఆడుతున్నారని చెప్పింది. ఇలాగే కొనసాగాలని వివరించింది. ప్రియాంక బట్టర్ ఫ్లై.. నీ ఆడ నువ్వే ఆడుకో.. కాజల్ గురించి ఏం చెప్పలేను.. టాప్ 8లో మీరంతా ఉన్నందుకు కంగ్రాట్స్ చెప్పింది ఆనీ మాస్టర్. మానస్‌కు మాత్రం నువ్వు బయటకు వచ్చాక మనం మంచి ఫ్రెండ్స్ అవుదామని చెప్పింది.

Tags

Latest News

Related News