Bigg Boss Telugu 5, Episode 81 :షన్నూ ఆగ్రహం.. చెంపలు వాయించుకున్న పింకీ.. భర్తపై కాజల్ ముద్దుల వర్షం

Bigg Boss Telugu 5, Episode 81 : బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యులందరూ గేమ్ చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక 81వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. మొదట కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఇందులో రవి, ప్రియాంక, షన్నూ ఉంటారు. బజర్ మోగగానే ‘నియంత మాటే శాసనం’ అనే టాస్కులో షన్నూ సింహాసనం ఎక్కుతాడు. రవి, ప్రియాంకలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా, తాను పింకీని ఎలిమినేట్ చేస్తానని, రవిని సేవ్ చేయదలుచుకున్నట్టు […].

By: jyothi

Updated On - Thu - 25 November 21

Bigg Boss Telugu 5, Episode 81 :షన్నూ ఆగ్రహం.. చెంపలు వాయించుకున్న పింకీ.. భర్తపై కాజల్ ముద్దుల వర్షం

Bigg Boss Telugu 5, Episode 81 : బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యులందరూ గేమ్ చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక 81వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. మొదట కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఇందులో రవి, ప్రియాంక, షన్నూ ఉంటారు. బజర్ మోగగానే ‘నియంత మాటే శాసనం’ అనే టాస్కులో షన్నూ సింహాసనం ఎక్కుతాడు. రవి, ప్రియాంకలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా, తాను పింకీని ఎలిమినేట్ చేస్తానని, రవిని సేవ్ చేయదలుచుకున్నట్టు చెప్తాడు.


అయితే, తన కమ్యూనిటీ(ట్రాన్స్ జెండర్)లో ఎవరూ ఇంతవరకు రాలేదని, తాను కెప్టెన్ అయ్యి మా కమ్యూనిటీకి పేరు తీసుకురావాలనుకుంటున్నానని అనడంతో షన్నూ ఒక్కసారిగా మండిపడుతాడు. నేను ఎమన్న వెదవను అనుకుంటున్నారా? ఇక్కడ కమ్యూనిటీ మాట ఎందుకు ఎత్తుతున్నారని ఫైర్ అవుతాడు. పింకీని ఎలిమినేట్ చేస్తున్నట్టు షన్నూ ప్రకటించడంతో ఇప్పటివరకు జరిగిన గొడవను గుర్తు చేసుకుంటూ బాత్రూంలోకి వెళ్లి చెంపలు వాయించుకుంటూ ఏడుస్తుంది ప్రియాంక. పింకీ పుట్టిన రోజు సందర్బంగా తనను సేవ్ చేస్తే బాగుండేదని కాజల్, సన్నీ అనుకుంటారు.


బిగ్‌బాస్ సీజన్ చివరి కెప్టెన్ షన్నూ..

అయితే, కెప్టెన్ కండెంటర్ల జాబితాలో రవి, షన్నూ మిగలగా.. శ్రీరామచంద్ర మినహా అందరూ షన్నూకు ఓటేయడంతో ఈ సీజన్ ఆఖరి కెప్టెన్‌గా షణ్ముక్ ఎంపికవుతాడు.ఇక సిరి అందంగా కనిపించాలని షణ్ముక్ ఆమెకు ముక్కుపుడక ఇస్తాడు. తనకు ఇష్టంలేకపోయినా షన్నూ కోసం పెట్టుకుంటుంది సిరి. ఆ తర్వాత బీబీ ఎక్స్‌ప్రెస్‌ అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను సభ్యులకు ఇస్తాడు బిగ్ బాస్.. ఇందో ‘చుక్‌ చుక్‌’ శబ్దం వస్తే సభ్యులంతా రైలు బోగీలా మారి జర్నీ చేయాలి.

Bigg Boss Telugu 5, Episode 81-2

Bigg Boss Telugu 5, Episode 81-2

కాజల్ ఫ్యామిలీ ఎంట్రీ.. భర్తపై ముద్దుల వర్షం

ఇక గేమ్ మధ్యలో బిగ్ బాస్ అందరినీ ఆగాలని ఆదేశిస్తాడు. అదే టైంలో కాజల్ కూతురు, భర్త హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. కూతురిని చూసి కాజల్ తెగ ఎమోషనల్ అవుతుంది. భర్తను పట్టుకుని తెగ ముద్దులిస్తుంది. నువ్వు ఇంతవరకు వస్తావనుకోలేదని కాజల్ కూతురు అనడంతో ఆమెకు కన్నీళ్లు ఆగవు. నువ్వు టాప్ -5లో ఉన్నా చాలని అంటుంది కాజల్ కూతురు.


మీ అమ్మను ఎవరైనా నామినేట్ చేస్తే నీకు కోపం వస్తుందా? అని శ్రీరామ్ అడుగడంతో అవునని అంటుంది కాజల్ కూతురు. అంతకు ముందు రవి, శ్రీరామ్, యానీ మాస్టర్ మీద చాలా కోపం వచ్చిందని, యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాక చాలా సంతోషించానని అంటుంది కాజల్ కూతురు..ఇక నా తరఫున హౌస్‌లోకి ఎవరు వస్తారో ముందే చెబితే తాను ప్రిపరేషన్ లో ఉంటానని కెమెరా ముందు దండం పెడతాడు షన్నూ.

Tags

Latest News

Related News