Bigg Boss Telugu, Episode 48: గొంతు బాగాలేదని బాధపడ్డ జెస్సీ.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పిన షణ్ముక్.. సిరికి గోరు ముద్దలు.. ప్రియా షాక్..

Bigg Boss Telugu, Episode 48: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్ కంటే చాలా భిన్నంగా సాగుతున్నది. కంటెస్టెంట్స్ ‘బిగ్ బాస్’ ఇస్తున్న డిఫరెంట్ టాస్కులను పూర్తి చేస్తున్నారు. ఏడో వారంలో కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ తమ లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించాలని టాస్క్ ఇవ్వగా, అందరు ఆ టాస్క్ పూర్తి చేశారు. తమ లైఫ్‌లో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్తూ […].

By: jyothi

Published Date - Sat - 23 October 21

Bigg Boss Telugu, Episode 48: గొంతు బాగాలేదని బాధపడ్డ జెస్సీ.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పిన షణ్ముక్.. సిరికి గోరు ముద్దలు.. ప్రియా షాక్..

Bigg Boss Telugu, Episode 48: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్ కంటే చాలా భిన్నంగా సాగుతున్నది. కంటెస్టెంట్స్ ‘బిగ్ బాస్’ ఇస్తున్న డిఫరెంట్ టాస్కులను పూర్తి చేస్తున్నారు. ఏడో వారంలో కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ తమ లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించాలని టాస్క్ ఇవ్వగా, అందరు ఆ టాస్క్ పూర్తి చేశారు. తమ లైఫ్‌లో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Telugu, Episode 48: కాజల్ ఆశలను అడియాసలు చేసిన రవి..
కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పారు. సన్నీ మాట్లాడుతూ తన అమ్మను గుర్తు చేసుకున్నాడు. ఓ మహిళ ముగ్గురు అబ్బాయిలను పెంచడం చాలా కష్టమని, మా అమ్మకు ముగ్గురు అబ్బాయిలని చెప్పాడు. ఇకపోతే తాను ఓ ప్రాజెక్ట్ చేస్తున్నపుడు చాలా మంది ఎగతాళి చేశారని, ఆ క్రమంలో తాను అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నానని, కానీ, సదరు ప్రాజెక్ట్ డైరెక్టర్ తనను వెళ్లిపోకుండా అడ్డుకున్నాడని, ఎగతాళి చేసేవారు పొగిడే రోజులొస్తాయని ధైర్యం చెప్పాడని ఆయన్ను గుర్తు చేసుకున్నాడు సన్నీ.

యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని, వాటిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇంటర్ కంప్లీషన్ తర్వాత తనకు బెంగళూరులో సీటొచ్చిందని, అయితే, ఆ టైంలో లవ్ బ్రేకప్ కావడంతో తన లైఫ్ పోయిందని ఫీలయ్యానని, ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పాడు. సరిగ్గా అదే టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ డోర్ కొట్టాడని, అప్పుడు తాను రూంలోనే ఉండిపోయానని, డోర్ లాక్ తీయలేదని, తర్వాత కొద్ది సేపటికి తీయగా తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి తనను బాగా కొట్టాడని, వాడి వల్లే తాను బతికి ఉన్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss Telugu, Episode 48

Bigg Boss Telugu, Episode 48

ఇక జెస్సీ మాట్లాడుతూ నాన్న చనిపోయాక పార్ట్ టైం జాబ్ చేశానని, ఫ్యాషన్ షోలో మోడల్ అవుదామనుకున్నపుడు సీనియర్స్ తనను చూసి వెక్కిరించారని చెప్పింది. అయితే, తనకు గొంతు సరిగా లేదని, దేవుడు ఇలా ఇచ్చాడేంటని బాధపడ్డానని పేర్కొంది. అయితే, అవన్నీ అవంతరాలు దాటుకుని తాను గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కానని, నేను మోడల్ అని ఎప్పుడూ బయటకు చెప్పనప్పటికీ ‘బిగ్ బాస్’ ద్వారా అందరికీ తాను మోడల్ అని తెలిసిపోయిందని సంతోషం వ్యక్తం చేసింది.

 

సిరి కూడా తన లైఫ్‌లో ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఈ టాస్కులో విజేతగా జెస్సీ నిలిచాడు. ఈ విక్టరీని సిరి, షణ్ముక్‌తో జెస్సీ సెలబ్రేట్ చేసుకున్నాడు. షణ్ను సిరికి గోరుముద్దలు తినిపించగా, ఆ తర్వాత సన్నీని చూసి నవ్వేసింది ప్రియ. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్కులో కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. ఈ సారి కెప్టెన్ కావాలని కాజల్ చాలా ఆశపడింది. కానీ, యాంకర్ రవి కాజల్ ఆశలను అడియాసలు చేసేశాడు. సన్నీకి యానీ మాస్టర్ హెల్ప్ చేసింది. దాంతో సన్నీ కెప్టెన్ అయ్యాడు.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News