Bigg Boss Telugu, Episode 49: యానీ మాస్టర్ హెల్ప్‌తో వీజే సన్నీ కెప్టెన్సీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్‌గా ఉన్న సన్నీ కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గత వారం ఎలిమినేట్ అయిన శ్వేతకు అంకితమిచ్చాడు. ఈ మేరకు ప్రకటన కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అవేంటో తెలుసుకుందాం.
Bigg Boss Telugu, Episode 49: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో?
‘బిగ్ బాస్’ హౌజ్ మెంబర్స్‌కు ‘సరైన మ్యాచ్‌ను వెతకండి’ అనే టాస్క్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్‌లోని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్’తమకు రాబోయే పార్ట్‌నర్స్ గురించి వివరించారు. ఎటువంటి లక్షణాలు ఉన్న వారు తమకు కావాలో చెప్పేశారు. శ్రీరామ్ తనకు బబ్లీ గర్ల్ కావాలని చెప్పగా, అర్థం చేసుకునే స్వభావం ఉన్న అమ్మాయి కావాలని సన్నీ చెప్పాడు. ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తన పార్ట్‌నర్ తననే చూస్తుండాలని, ఎప్పుడూ తనను బుజ్జగిస్తుండాలని, ఇరు కుటుంబాలను చాలా ప్రేమగా చూసుకోవాలన్నాడు.
పింకీ తనకు కాబోయే పార్ట్‌నర్ తనకంటే చాలా ఎక్కువ హైట్ ఉండాలని, అటువంటి వాడికి తన వద్ద ఉన్న ప్రేమను ఇచ్చేస్తానని అంది. ఇకపోతే కంటెస్టెంట్స్ అందరూ జెస్సీ మినహా పింకీ, మానస్ బెస్ట్ కపుల్ అని చెప్పారు. దాంతో ‘బిగ్ బాస్’ పూలమాలలు ఇవ్వగా వారు మార్చుకున్నారు. అనంతరం ‘గువ్వాగోరింక’ పాటకు డ్యాన్స్ చేశారు.
Bigg Boss Telugu, Episode 49
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అక్కినేని ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని హౌజ్ మెంబర్స్‌ను అడిగాడు. దాంతో కంటెస్టెంట్స్ ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారు. రేషన్ మేనేజర్ గా ప్రియాంక ఫెయిల్ అయిందని, కాబట్టి ఆమెనే వరస్ట్ పర్ఫార్మర్ అని అన్నాడు. ఈ సందర్భంలోనే నాగ్.. సిరి స్టిక్కర్స్ దొంగిలించే క్రమంలో అమ్మతోడు ఎందుకు వేశావని నాగార్జున రవిని అడిగాడు.
అలా యాంకర్ రవి అడ్డంగా దొరికపోయాడు. అది తప్పేనని ఒప్పుకున్నాడు రవి. ఇక షణ్ముక్ మాట్లాడుతూ సిరిని వరస్ట్ పర్ఫారర్ అని అన్నాడు, సిరి, కాజల్‌ను, విశ్వ, ప్రియాంక, జెస్సీ, విశ్వను వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పారు.ఇకపోతే హౌజ్‌లో చాలా సార్లు ఇతర కంటెస్టెంట్స్‌ను ఉద్దేశించి చెంప పగులగొడతానన్న ప్రియపై నాగార్జున ఫైర్ అయ్యాడు. అందరినీ ఎన్ని సార్లు చెంప పగులగొడతావ్ అంటూ ప్రశ్నించాడు. దానిపై ప్రియ వివరణ ఇచ్చే ప్రయత్నించాడు. ఆ తర్వాత అలా తిట్టకూడదని సూచించాడు. ఈ క్రమంలోనే మెజారిటీ సభ్యులు చెత్త ఆటగాడిగా విశ్వ పేరు పేర్కొనడంతో అతడిని సోమవారం జైలులోకి పంపిస్తానని నాగ్ తెలిపాడు. ఫైనల్‌గా శ్రీరామ్, కాజల్ సేఫ్ అని అనౌన్స్ చేశాడు. అయితే, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో అనే సస్పెన్స్ అందరినీ వెంటాడుతుంది. ఈ వారం ప్రియ ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.