Vaani kapoor :వాణీకపూర్ కొంటె చూపులు.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు..

Vaani kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పాలి. 1988 ఆగస్టులో జన్మించిన ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంటుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసును దోచేస్తుంది. 2013 సంవత్సరంలో రొమాంటిక్ కామెడీ శుద్ద్ దేశీ రొమాన్స్‌లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకిగానూ ఈ భామను ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ భామ నటించింది చాలా తక్కువ మూవీసే అయినా.. ప్రేక్షకులకు […].

By: jyothi

Published Date - Thu - 25 November 21

Vaani kapoor :వాణీకపూర్ కొంటె చూపులు.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు..

Vaani kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పాలి. 1988 ఆగస్టులో జన్మించిన ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంటుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసును దోచేస్తుంది. 2013 సంవత్సరంలో రొమాంటిక్ కామెడీ శుద్ద్ దేశీ రొమాన్స్‌లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకిగానూ ఈ భామను ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ భామ నటించింది చాలా తక్కువ మూవీసే అయినా.. ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరైంది. ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. మూవీస్‌కు బ్రేక్ ఇచ్చిన మూడు సంవత్సరాల తర్వాత 2019లో రిలీజ్ అయిన వార్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డు నమోదు చేసింది. ఇది ఆమె సినీ కెరీర్‌లో మార్క్ చూపించిన మూవీ.

vaani kapoor

vaani kapoor

vaani kapoor

vaani kapoor

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. తన ఫొటోస్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. లైట్ బ్రౌన్ డ్రెస్‌లో నవ్వుతూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. ఇక వీటిని చూసిన యూత్ ఆమె అందానికి, చూపులకు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలు చూపును తప్పుకోనివ్వడం లేదు. దీంతో వాటిని ఫ్యాన్స్ సైతం విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతే మరి ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం హడావుడి చేయకపోతే ఎలా.. మరి పనిలో పనిగా మీరు కూడా ఈ ఫొటోలను ఓ సారి చూసెయ్యండి.

vaani kapoor

vaani kapoor

Tags

Related News