సినిమా హీరోలూ.. రియల్ యాక్సిడెంట్లు..

ఒకప్పుడు సినిమాలంటే, ‘డూప్’లను పెట్టి మేనేజ్ చేసేస్తుండేవారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోకి వచ్చాక, రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాల జోరు పెరిగింది. అంతకు ముందు కూడా హీరోలు చాలా సాహసాలు చేసినా, చిరంజీవి తర్వాత రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాల పట్ల ఇతర హీరోలూ ఆసక్తి పెంచుకోవడం మొదలైందంటారు. ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవు చాలామంది హీరోలు, యాక్షన్ సీన్స్ సహజంగా కనిపించేందుకోసం రిస్కీ స్టంట్లు చేశారు. అలా వారు చూపిన బాటలో, నేటి […].

By: jyothi

Published Date - Sat - 22 May 21

సినిమా హీరోలూ.. రియల్ యాక్సిడెంట్లు..

ఒకప్పుడు సినిమాలంటే, ‘డూప్’లను పెట్టి మేనేజ్ చేసేస్తుండేవారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోకి వచ్చాక, రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాల జోరు పెరిగింది. అంతకు ముందు కూడా హీరోలు చాలా సాహసాలు చేసినా, చిరంజీవి తర్వాత రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాల పట్ల ఇతర హీరోలూ ఆసక్తి పెంచుకోవడం మొదలైందంటారు. ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవు చాలామంది హీరోలు, యాక్షన్ సీన్స్ సహజంగా కనిపించేందుకోసం రిస్కీ స్టంట్లు చేశారు. అలా వారు చూపిన బాటలో, నేటి యంగ్ హీరోలు.. మరింత రిస్కీ అటెంప్ట్స్ చేసేస్తున్నారు, కొన్నిసార్లు తీవ్రంగా గాయపడుతున్నారు కూడా. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రీల్ హీరోల రియల్ యాక్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం.

మంచు విష్ణు బైక్ యాక్సిడెంట

మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, యాక్షన్ సన్నివేశాలు చేసే క్రమంలో ఎక్కువగా రిస్క్ తీసేసుకుంటాడు. తనతోపాటు, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా అలా రిస్కీ సీన్ చేస్తూ గాయపడ్డాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటాడు మంచు విష్ణు. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నాళ్ళ పాటు సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

నాని.. రోడ్డు ప్రమాదంలో..
నేచురల్ స్టార్ నాని ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దాంతో షూటింగ్ కొద్ది రోజులపాటు ఆగిపోయింది. అయితే, ఆ ప్రమాదంలో నాని గాయపడిన విషయం కొద్ది రోజుల వరకూ బయటకు రాలేదు. ప్రమాదం పెద్దదే అయినా, నాని చిన్న గాయాలతో బయటపడం పట్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
శర్వానంద్ – ఇలా గాయపడ్డాడు..
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం శిక్షణ తీసుకుంటుండగా శర్వానంద్ గాయపడ్డాడు. భుజానికి తీవ్ర గాయమైంది. సర్జరీ చేసి, ఆ గాయాన్ని సరిచేశారు. కొన్నాళ్ళపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది షర్వానంద్. స్కై డైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నాగ శౌర్య
హీరో నాగ శౌర్య నటించిన ‘అశ్వద్ధామ’ సినిమా, షూటింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకుంది ఓ ప్రమాదం. యాక్షన్ సీన్ చేస్తుండగా, శర్వానంద్ గాయాలపాలయ్యాడు. దాంతో షూటింగ్ కొన్నాళ్ళ పాటు నిలిపేయాల్సి వచ్చింది. మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్.
సందీప్ కిషన్
సందీప్ కిషన్, ‘తెనాలి రామకృష్ణ’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. బస్సులోంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. అయితే, అక్కడ భద్రతా ఏర్పాట్లు వుండడంతో, పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు అద్దాలు పగిలి, గాజు ముక్కలు గుచ్చుకున్నాయి.
నిఖిల్ సిద్దార్ధ
తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ తన తాజా చిత్రం ‘కార్తికేయ-2‘ షూటింగ్ కోసం పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువేనంటూ ఆందోళన నెలకొనగా, అదేం లేదు చిన్న ప్రమాదమేనంటూ కార్తికేయ, సోషల్ మీడియా వేదికగా వెల్లడించేసరికి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
రాజ్ తరుణ్..
షూటింగ్ కోసం వెళ్ళి వస్తుండగా రాజ్ తరుణ్ గాయపడినట్లు అప్పట్లో ఓ వార్త వెలుగు చూసింది. అయితే, మద్యం మత్తులో రాజ్ తరుణ్ ఆ ప్రమాదానికి కారణమయినట్లు ఆరోపణలు వచ్చాయి. అదో పెద్ద వివాదమైంది. రాజ్ తరుణ్ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ తర్వాత ఆ వివాదం పద్దుమణిగింది. ఆ ఘటనలో రాజ్ తరుణ్ శారీరకంగా గాయకపడకపోయినా, మానసికంగా తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.
రిస్కీ అటెంప్ట్స్ హీరోలు చేయడం కొంతవరకు సబబే అయినా, చాలా సందర్భాల్లో సినిమా షూటింగ్ షెడ్యూల్స్ గందరగోళంగా తయారైపోయి, డేట్లు క్లాష్ వచ్చేసి, ఆయా సినిమాలు ఆలస్యమవడమో ఆగిపోవడమో కూడా అరుదుగా జరుగుతుంటుంది.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News