Charmi Kaur : వామ్మో.. 14 ఏండ్లకే అలాంటి పని చేసిన చార్మీ.. మామూల్ది కాదుగా..!

Charmi Kaur : పూరీ జగన్నాథ్ కు చార్మీకు మధ్య ఏదో ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరు మాత్రం స్పందించట్లేదు..

By: jyothi

Updated On - Fri - 19 May 23

Charmi Kaur : వామ్మో.. 14 ఏండ్లకే అలాంటి పని చేసిన చార్మీ.. మామూల్ది కాదుగా..!

Charmi Kaur : సీనియర్ హీరోయిన్ చార్మీ కౌర్ ఎంతగా కాంట్రవర్సీల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె మాస్ అందాలకు భారీ ఫాలోయింగ్ ఉండేది. ఇక హీరోయిన్ గా చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది ఈ భామ.

అయితే పూరీ జగన్నాథ్ కు ఆమెకు మధ్య ఏదో ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరు మాత్రం స్పందించట్లేదు. అయితే తాజగా చార్మీ కౌర్ కు సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. చార్మీకి 14 ఏండ్ల వయసున్నప్పుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందంట.

అవును మీరు విన్నది నిజమే. ఆమె మొదటగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మూవీ నీతోడు కావాలి. ఈ సినిమాలో ఆమె నటిస్తున్నప్పుడు ఆమె వయసు కేవలం 14 ఏండ్లు. అప్పుడు ఆమె స్కూల్ లో చదువుతోంది. ముంబైలో ఆమెను చూసిన సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి.. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి సినిమా చేసేందుకు ఒప్పించాడు.

మొదట ఈ సినిమా ఆఫర్ ను చార్మీ తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు. కానీ తర్వాత ఒప్పుకున్నారు. కానీ సెలవు రోజుల్లో మాత్రమే చార్మీ వచ్చి షూటింగ్ చేసేదంట. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ దీని తర్వాత తమిళంలో చేసిన మరో మూవీ హిట్ అవడంతో… ఆమెకు సౌత్ లో చాలా అవకాశాలు వచ్చాయి.

Read Also : Bichagadu 2 Movie Review : ‘బిచ్చగాడు 2’ రివ్యూ.. అంచనాలు అందుకుందా..?

Read Also : Bichagadu 2 Movie Review : ‘బిచ్చగాడు 2’ రివ్యూ.. అంచనాలు అందుకుందా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News