Chiranjeevi : సాధారణంగా సినిమాల్లో ఏదో ఒక సినిమా హిట్ అయితే చాలు.. అదే ఫార్మాట్ సినిమాలు నెక్స్ట్ చేసేందుకుగాను మేకర్స్ మొగ్గు చూపుతుంటారు. అలా చేయడం ద్వారా తమ చిత్రం కూడా హిట్ అవుతుందని భావిస్తుంటారు. కాగా, యాధృచ్ఛికమో లేదా నిజంగానే ఇద్దరూ అలా ఫిక్స్ అయ్యారో తెలియదు. కానీ, స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి కొంత కాలం పాటు ఒకే పంథాలో కొనసాగి సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. అవేంటో తెలుసుకుందాం..
Chiranjeevi Balakrishna 2
మెగాస్టార్ చిరంజీవి నటించిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమా ‘ఇంద్ర’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. కాగా, ‘ఇంద్ర’ చిత్రం విడుదలైన అదే ఏడాదిలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకులను అలరించింది. అయితే, ఈ సినిమాకు కొన్నేళ్ల ముందరే ‘సమరసింహారెడ్డి’ అనే చిత్రం చేసి బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాడు.
ఈ రెడ్డి అని పేరు వేసే టైటిల్ సెంటిమెంట్ కూడా ఇద్దరి చిత్రాల్లో ఉందట. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి ప్రేక్షకులను అలరిస్తే… బాలకృష్ణ చెన్నకేశవరెడ్డిగా, సమర సింహారెడ్డిగా అదరగొట్టేశాడు. ఇటీవల మెగాస్టార్ చిరు ‘సైరా నరసింహారెడ్డి’గా ప్రేక్షకులను పలకరించాడు. ఫ్రీడం ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కింది.
Chiranjeevi Balakrishna
బాలకృష్ణ నటించిన సినిమాల్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయని ఆయన అభిమానులు చెప్తుంటారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ కొద్ది కాలం పాటు ఒకే పంథాలో అనగా యాక్షన్ సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో వారి పంథా పూర్తిగా మారిపోయింది. చిరంజీవి సందేశాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపుతూనే ఎంటర్‌టైన్మెంట్‌కు ప్రయారిటీ ఇస్తూ కమర్షియల్ ఫిల్మ్స్ చేశాడు.
Chiranjeevi Balakrishna 1
ఇకపోతే ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా తర్వాత అదే స్టోరి లైన్‌తో కొంచెం మార్పులతో ‘భరతసింహారెడ్డి’ ఫిల్మ్ వచ్చింది. ఇందులో రాజశేఖర్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. అయితే, రెడ్డి పేరిట రాయలసీమ లేదా యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కాలేదు. కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. యంగ్ హీరో నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫిల్మ్‌ను ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో ఆదరించలేదు. 1980లో సీనియర్ నటి శారద కీలక పాత్రలో నటించిన ‘కడప రెడ్డమ్మ’ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, ఆ సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చే సరికి తుస్సుమనిపించింది.