Chiranjeevi : చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్.. ఆమెనే..

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి సక్సెస్ అయ్యాడు. స్వయం కృషితో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి మెగాస్టార్ అయిన చిరంజీవి.. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో విలన్ రోల్స్ ప్లే చేశాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, నటన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న సమయంలోనే చిరంజీవి టాప్ […].

By: jyothi

Published Date - Mon - 8 November 21

Chiranjeevi : చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్.. ఆమెనే..

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి సక్సెస్ అయ్యాడు. స్వయం కృషితో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి మెగాస్టార్ అయిన చిరంజీవి.. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో విలన్ రోల్స్ ప్లే చేశాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు.

డ్యాన్స్, ఫైట్స్, నటన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న సమయంలోనే చిరంజీవి టాప్ హీరోగా ఎదిగారు. కాగా, ఓ సందర్భంలో చిరంజీవి చెంప చెల్లుమనిపించిందట ఓ హీరోయిన్.. అయితే, అది నిజంగా కాదండోయ్.. సినిమా షూటింగ్ సమయంలోనే.. ఆ మూవీ ఏంటి? ఎవరు ఆ హీరోయిన్.. అనే విషయాలు తెలుసుకుందాం.

Chiranjeevi n1

Chiranjeevi n1

సీనియర్ హీరోయిన్ రాధిక మెగాస్టార్ చిరంజీవి జంటగా నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్సే. చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధికనే కాగా, వీరిరువురు మంచి ఫ్రెండ్స్ కూడా. కాగా, చిరంజీవి నటించిన ‘న్యాయం కావాలి’ సినిమా షూటింగ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ చిత్రం తమిళంలో వచ్చిని సినిమాకు తెలుగు రీమేక్ కాగా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు కోదండరామిరెడ్డి మార్పులు చేశారు.

chiranjeevi

chiranjeevi

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. పాత్ర ప్రకారంగా..హీరోయిన్ రాధికను ప్రేమించినట్లు నటించి ఆమెను లొంగదీసుకుని వదిలేస్తాడు. ఆ సందర్భంలో రాధిక కోర్టు మెట్లు ఎక్కడం.. ఆ తర్వత కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ సీన్‌లో రాధిక చిరంజీవి చెంపను చెల్లుమనిపించాలి. ఈ విషయం డైరెక్టర్ కోదండరామిరెడ్డి రాధికకు చెప్తాడు. అయితే, ఆ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో తాను నిజంగా కొట్టలేనని యాక్టింగ్ చేస్తానని అంటుంది. కానీ, చిరంజీవి మాత్రం నిజంగానే కొట్టాలని అంటాడు. అలా చాలా సార్లు టేక్స్ అయినప్పటికీ సీన్ సరిగా రావడం లేదు. దాంతో మెగాస్టార్ చిరు… రాధికను గట్టిగానే కొట్టాలని, నిజంగా కొట్టాలని రాధికకు చెప్తాడు. అలా చేస్తేనే సీన్ ఫర్ఫెక్ట్‌గా వస్తుందని వివరిస్తాడు. దాంతో రాధిక ఒప్పుకుంటుంది.

Chiranjeevi raadhika

Chiranjeevi raadhika

ఇక డైరెక్టర్ కోదంరామిరెడ్డి యాక్షన్ చెప్పగానే నిజంగానే రాధిక చిరంజీవి చెంప చెల్లుమనిపిస్తుంది. అలా చెంపపైన కొట్టినందుకుగాను చిరంజీవి చెంప వాచిపోయిందట. అది చూసి మూవీ యూనిట్ సభ్యులు షాకయ్యారు. కాగా, క్రీమ్ పెట్టుకుని వాపును చిరంజీవి తగ్గించుకున్నాడట. చిరంజీవి చాలా సార్లు రియల్ సీన్స్ చేసేందుకు ఇష్టపడేవాడు. అలా చేయడం వల్లే చిరంజీవికి ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడిందని సినీ పరిశీలకులు అంటున్నారు. అప్పట్లో ఓ చిత్రంలో షూటింగ్‌లో భాగంగా చిరంజీవి నిజంగానే కదిలే ట్రైన్‌లో ఫైట్ చేశాడట.

Tags

Latest News

Related News