Chiranjeevi : ఈ సినిమా వెనుకా పెద్ద కథే.. ఆ హీరో కాదన్న తర్వాతే చిరంజీవి వద్దకు ‘హిట్లర్’ ఫిల్మ్..

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్వయం కృషితో ఎదిగారు. ఒక్కొక్క సినిమా చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజీ ఏర్పరుచుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు చిరంజీవి. కాగా, ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘హిట్లర్’ తొలుత ఆయన చేయాల్సిన సినిమా కాదట.. ఇందుకు సంబంధించిన విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి.. వాస్తవానికి ‘హిట్లర్’ సినిమా రీమేక్ అయినప్పటికీ చిరంజీవి కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ఈ మూవీ. ఆయన […].

By: jyothi

Published Date - Sun - 7 November 21

Chiranjeevi : ఈ సినిమా వెనుకా పెద్ద కథే.. ఆ హీరో కాదన్న తర్వాతే చిరంజీవి వద్దకు ‘హిట్లర్’ ఫిల్మ్..

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్వయం కృషితో ఎదిగారు. ఒక్కొక్క సినిమా చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజీ ఏర్పరుచుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు చిరంజీవి. కాగా, ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘హిట్లర్’ తొలుత ఆయన చేయాల్సిన సినిమా కాదట.. ఇందుకు సంబంధించిన విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి..

వాస్తవానికి ‘హిట్లర్’ సినిమా రీమేక్ అయినప్పటికీ చిరంజీవి కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ఈ మూవీ. ఆయన నటించిన చిత్రాల్లో మైలు రాయిగా నిలిచిపోయిన ఈ సినిమా..వెనుక చాలా పెద్ద కథే ఉంది. 1996లో తెలుగులో ‘హిట్లర్’ మూవీ విడుదల కాగా, అంతకు ముందే ఈ సినిమాను మమ్ముట్టి హీరోగా మలయాళంలో సిద్దిఖీ అనే డైరెక్టర్ తెరకెక్కించారు.

రిలీజ్‌కు వన్ వీక్ ముందర ఎడిటర్ మోహన్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే మలయాళ సినిమాకు సంబంధించిన సీడీని హైదరాబాద్‌కు తెప్పించుకుని చూశాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే కచ్చితం బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ అవుతుందని నమ్మిన ప్రొడ్యూసర్ మోహన్..అలా చేద్దామనుకున్నాడు. సినిమా చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ రాజా.. ఈ విషయం రచయిత మరుధూరి రాజాకు చెప్పగా, ఆయన వెళ్లి నవ్వుల దర్శకుడు ఈవివి సత్యనారాయణకు చెప్పాడు. అయితే, ఎడిటర్ మోహన్ బాబును ఈ సినిమాలో హీరోగా పెట్టాలనుకున్నాడు. అలా మోహన్ బాబు హీరోగా ఈవివి దర్శకుడిగా ‘హిట్లర్’ సినిమా ప్లాన్ చేశారు.

Chiranjeevi Hitler 3

Chiranjeevi Hitler 3

అప్పటికే ఈవివి మోహన్ బాబుతో ‘వీడెవడండీ బాబూ, అదిరింది అల్లుడు’ సినిమాలు మోహన్ బాబుతో చేసేందుకు కమిటయ్యాడు. దాంతో మరోసారి మోహన్ బాబుతో చేయలేనని ఈవివి తిరస్కరించాడు. అలా మోహన్ బాబు నుంచి హిట్లర్ సినిమా వేరే వాళ్లకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ విషయం రైటర్ రాజా చిరంజీవికి చెప్పగా, తాను ఈ సినిమా చేస్తానని ఎడిటర్ మోహన్‌కు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అలా ‘హిట్లర్’ సినిమా మోహన్ బాబు చేతి నుంచి జారిపోగా, చిరంజీవి దక్కించుకున్నాడు. అయితే, రైటర్ రాజా అప్పటి వరకు చిన్న సినిమాలకు రచయితగా పని చేశాడు.

Chiranjeevi Hitler 1

Chiranjeevi Hitler 1

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పని చేయాలనుకుని ఆనందపడ్డాడు. కానీ, ఆ ఆనందం మేకర్స్ అతనికి ఎక్కువ సేపు ఇవ్వలేదు. డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్యను ఫైనల్ చేసిన తర్వాత రైటర్ గా ఎల్బీ శ్రీరామ్ వచ్చారు. రాజా ఈ విషయంలో బాధపడగా, ఎడిటర్ మోహన్ కోరిక మేరకు రాజా ఒక వర్షన్ రాశారు. ఈ విషయాలన్నీ కూడా రైటర్ రాజా తెలిపాడు. అలా చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు కథను మార్చి సినిమా తీయగా సూపర్ సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.

Tags

Latest News

Related News