Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌లోకి వెళ్లి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇక ఆ తర్వాత చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. చారిత్రాత్మక చిత్రం ‘సైరా’పూర్తి చేసిన చిరు.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌లో గాయపడిన సంగతి విదితమే. కాగా తాజాగా సాయితేజ్ కోలుకున్నట్లు తెలుస్తోంది.
సాయితేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సూపర్ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఆ సినిమా దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, దాన్ని ప్రొడ్యూస్ చేసిన వారిలో మెగా హీరో సాయితేజ్ వాళ్ల నాన్న ఉన్నారన్న సంగతి తెలియకపోవచ్చు. ఇంతకీ సాయిధరమ్ తేజ్ వాళ్ల నాన్న చిరంజీవితో నిర్మించిన ఆ సినిమా ఏంటంటే..
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందేశాత్మక చిత్రాల్లో చిరంజీవి నటించినప్పటికీ మాస్ మసాలా ఉన్న చిత్రాలతోనే చిరుకు మంచి పేరొచ్చింది. అటువంటి చిత్రాల్లో ఒకటి ‘రౌడీ అల్లుడు’. ‘గ్యాంగ్ లీడర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎంటర్‌టైన్మెంట్ మూవీ చేయాలని అనుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే అప్పటికే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫిల్మ్ చేసి ఉన్నాడు మెగాస్టార్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ఆ సినిమా సూపర్ సక్సెస్ కాగా, నెక్స్ట్ తెరకెక్కిన సినిమా ‘రౌడీ అల్లుడు’.
Chiranjeevi
అల్లు అరవింద్ సమర్ఫణలో సాయి రాం ఆర్ట్స్ బ్యానర్‌లో చిరు తోడల్లుడు డాక్టర్ కె.వేంకటేశ్వరరావు, బావ గారైన పంజా ప్రసాద్ అనగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫాదర్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్. కాగా, సాయి రాం ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఏకైక మూవీ ఇదొక్కటే. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలన్నిటినీ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకున్నారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శోభన, దివ్యభారతి నటించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత పంజా ప్రసాద్ మరే చిత్రం నిర్మించలేదు. ఈ చిత్రంలో అత్త అల్లుడి రొమాన్స్‌తో పాటు మాస్ డైలాగ్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి సత్యానంద్, స్టోరి, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ చిత్రంలో దివంగత నటుడు అల్లు రామలింగయ్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల మైండ్‌లో రిజిస్టర్ అవడంతో పాటు బాగా పాపులర్ అయ్యాయి. మొదట్లో ఈ సినిమాకు టైటిల్‌గా ‘ఫిఫ్టీ.. ఫిఫ్టీ’, ‘ఆటోజానీ’ పేర్లను పరిశీలించిన మూవీ యూనిట్ సభ్యులు ఫైనల్‌గా ‘రౌడీ అల్లుడు’ టైటిల్ ఫిక్స్ చేశారు.