Chiranjeevi Top 10 Movies: చిరంజీవి కెరియర్ లో టాప్ 10 సినిమాలు

Chiranjeevi Top 10 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే చిరంజీవి అనేది ఒక పేరు కాదు అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా, మెగాస్టార్ గా ఎదగడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అలాంటిది చిరంజీవి సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగి ఒక మిడిల్ […].

By: jyothi

Published Date - Thu - 16 September 21

Chiranjeevi Top 10 Movies: చిరంజీవి కెరియర్ లో టాప్ 10 సినిమాలు

Chiranjeevi Top 10 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే చిరంజీవి అనేది ఒక పేరు కాదు అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా, మెగాస్టార్ గా ఎదగడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అలాంటిది చిరంజీవి సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా హీరో అవ్వచ్చు అని నిరూపించాడు అలాగే చిరంజీవి అద్భుతమైన నటనని కనబరిచిన కొన్ని సినిమాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం…
పున్నమినాగు


ఈ సినిమాలో చిరంజీవి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది ఎందుకంటే ప్రతి పౌర్ణమికి ఒకసారి పాములాగా మారే క్యారెక్టర్ లో చిరంజీవి ఒదిగిపోయి నటించాడు. అప్పటిదాకా చూడని చిరంజీవి నటనని చూసిన జనాలు నిజంగా ఆశ్చర్యానికి గురయ్యారు అని చెప్పాలి.
శుభలేఖ
కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన శుభలేఖ సినిమా లో చిరంజీవి అద్భుతమైన నటనని జనాలకి చూపించాడు.1982 లో ఈ సినిమా రిలీజై చిరంజీవి కెరీర్లోనే అప్పటివరకు ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన నటనను కనబర్చడంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మూర్తి అనే క్యారెక్టర్లో చిరంజీవి కనబరిచిన నటనకు గాను ఫస్ట్ టైమ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమాల్లో నటన గురించి చిరంజీవి చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు…
అభిలాష
నవల రైటర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమాలో చిరంజీవి లాయర్ గా అద్భుతమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు…
ఖైదీ
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ ని పూర్తిగా మార్చేసిన సినిమా అని చెప్పవచ్చు ఎందుకంటే అప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు వేరు ఖైదీ సినిమా హీరో వేరు దాంతో చిరంజీవి ఒక్కసారిగా ఖైదీ సినిమాతో ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు.
తనకు అన్యాయం చేసిన వాళ్ళని చంపే క్యారెక్టర్ లో చిరంజీవి అద్భుతమైన నటనని చూపిస్తూ ప్రేక్షకుల్ని సైతం మైమరిపించేలా చేశారు.
స్వయంకృషి
కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా మంచి విజయాన్ని సాధించింది అప్పటికే టాప్ హీరోగా ఉన్న చిరంజీవి చెప్పులు కుట్టే పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. తన కెరీర్లో ది బెస్ట్ అనిపించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి…
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమా లో చిరంజీవి అవుట్ అండ్ అవుట్ కామెడీ పాత్రలో కనిపించాడు ఒకరకంగా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అందులో చిరంజీవి చేసిన జేమ్స్ పాండ్ పాత్రకి నవ్వని జనాలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఈ సినిమా కూడా చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు…
ఆపద్బాంధవుడు
కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి అద్భుతమైన నటనని కనబరిచాడు. ఈ సినిమాలో నటించినందుకు గానూ చిరంజీవికి ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది క్లైమాక్స్ లో తన అమాయకపు నటనతో అందరి చేత కంటతడి పెట్టించాడు చిరంజీవి…
రుద్రవీణ
కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా రుద్రవీణ ఒక మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి…
చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలు చాలానే ఉన్నాయి దాంట్లో కొన్ని చిత్రాలు మాత్రమే మనం గుర్తు చేసుకోవడం జరిగింది అలా చెప్పుకుంటూపోతే చిరంజీవి చేసిన 150 పైచిలుకు సినిమాల్లో వంద సినిమాల వరకు బెస్ట్ చిత్రాలు గా ఉంటాయి…

Latest News

Related News