Priyamani-Anushka: ప్రియమణి, అనుష్కల మధ్య గొడవ: అసలేం జరిగిందంటే..

Priyamani-Anushka హీరోయిన్ల మధ్య గొడవలు చాలా మామూలే. దీన్ని కొందరు ఆధిపత్య పోరు అంటారు.. ఆరోగ్యకరమైన పోటీ అని మరికొందరు అంటారు. ఈగో క్లాషెస్ కారణంగా కూడా ఒకరితో ఒకరికి గొడవలు జరుగుతుంటాయి. మామూలుగానే రెండు కొప్పులు ఓ చోట ఇమడలేవన్న అంశాన్ని మహిళల మధ్య గొడవల గురించి ప్రస్తావిస్తుంటారు. అలాంటిది, సినీ హీరోయిన్ల మధ్య గొడవలు ఎందుకు వుండకూడదు.? లోపల ఎన్ని గొడవలున్నా కానీ, పైకి మాత్రం మామూలుగానే బిహేవ్ చేస్తుంటారనుకోండి. అది వేరే సంగతి. […].

By: jyothi

Published Date - Sat - 31 July 21

Priyamani-Anushka: ప్రియమణి, అనుష్కల మధ్య గొడవ: అసలేం జరిగిందంటే..

Priyamani-Anushka హీరోయిన్ల మధ్య గొడవలు చాలా మామూలే. దీన్ని కొందరు ఆధిపత్య పోరు అంటారు.. ఆరోగ్యకరమైన పోటీ అని మరికొందరు అంటారు. ఈగో క్లాషెస్ కారణంగా కూడా ఒకరితో ఒకరికి గొడవలు జరుగుతుంటాయి. మామూలుగానే రెండు కొప్పులు ఓ చోట ఇమడలేవన్న అంశాన్ని మహిళల మధ్య గొడవల గురించి ప్రస్తావిస్తుంటారు. అలాంటిది, సినీ హీరోయిన్ల మధ్య గొడవలు ఎందుకు వుండకూడదు.? లోపల ఎన్ని గొడవలున్నా కానీ, పైకి మాత్రం మామూలుగానే బిహేవ్ చేస్తుంటారనుకోండి. అది వేరే సంగతి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్కకీ, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ప్రియమణి మధ్య పెద్ద గొడవలే జరిగాయంటూ అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. ఆ గొడవలేంటో, అసలు అందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


‘రగడ’ సినిమా టైమ్ లో వీళ్ల మధ్య ఏం జరిగిందంటే..

స్వీటీ అనుష్క అంటే హాట్ బ్యూటీ ప్రియమణికి అస్సలు పడేది కాదట. అనుష్క పేరు ఎత్తితేనే ప్రియమణి చిరాకు పడేదట.. అంటూ ‘రగడ’ సినిమా టైమ్ లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ సినిమాలో నాగార్జున హీరో కాగా, ప్రియమణి, అనుష్క హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైమ్ లో స్వీటీ అనుష్కను ప్రియమణి బాడీ షేమ్ కూడా చేసిందని వార్తలొచ్చాయి. ఈ సినిమాలో ఒకరిని ఒకరు డామినేట్ చేసుకునేలా విచ్చల విడిగా గ్లామర్ పండించారు. హాట్ హాట్ డాన్సులతో ప్రియమణి, అంద చందాలతో అనుష్క నువ్వా నేనా అనేంతలా అదరగొట్టేశారు. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సాంగ్ లో నాగ్ తో ఆన్ స్ర్కీన్ రొమాన్సు అదరహో అనిపిస్తుంది. ప్రియమణి మంచి డాన్సర్ కావడంతో అలవోకగా డాన్సులేసేస్తుంది. కానీ, అనుష్క కాస్త కష్టపడుతుంది. అయితే, ఎక్కడా తగ్గలేదనుకోండి.


అసలు వీరిద్దరి మధ్యా గొడవకి కారణమేంటంటే.?
ఓ హీరో విషయంలో ఇద్దరి మధ్యా గొడవలు పెరిగి పెద్దవయ్యాయనీ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ హీరో ఎవరో కాదు, మాస్ హీరో గోపీచంద్. గోపీచంద్ తో కలిసి వీరిద్దరూ ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆ టైమ్ లోనే వీరి మధ్య గొడవలు తలెత్తాయనీ అంటుంటారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఈ వివాదానికి చెక్ పెట్టింది ప్రియమణి. అవన్నీ ఉత్త పుకార్లేనని కొట్టి పాడేసింది. అనుష్క ఈ విషయంలో స్పందించడానికి నిరాకరించింది. కానీ, కోల్ట్ వార్ అయితే, వీరిద్దరి మధ్యా అలాగే ఉందని ఇప్పటికీ అంటుంటారు.


‘చండీ‘ సినిమాని అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించాల్సి ఉండగా, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు ప్రియమణి చేతికి చిక్కింది. వీరి మధ్య గొడవలకు ఈ ప్రాజెక్టు కూడా ఓ కారణమే అంటుంటారు. అయితే, ‘చండీ’ సినిమా ప్రియమణికి పెద్దగా కలిసొచ్చింది లేదనుకోండి.


అయితే, ‘అరుంధతి‘ సినిమాలో నటించిన తర్వాత స్వీటీ అనుష్క శెట్టి రేంజ్ మారిపోయింది. ఊహించని స్థాయిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. ఇప్పటికీ అనుష్క స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. 50 కోట్ల బడ్జెట్.. అనుష్క సినిమాకి అంటే అది చిన్న విషయమే. ఇక, అనుష్కతో పోల్చేయలేంగానీ.. ప్రియమణి కూడా చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని దక్కించుకున్నా, నిలబెట్టుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి.. వరుస సినిమాలతో బిజీ అవుతోంది. కానీ, ఫుల్ టైమ్ హీరోయిన్ గా కాదు, ఇంపార్టెంట్ రోల్స్ కే పరిమితమైంది. ఇక బుల్లితెరపై ప్రియమణి హవా బాగా నడుస్తోంది.

Latest News

Related News