Ram Gopal Varma : ఆర్జీవీ ఏం మాట్లాడినా సరే అది చాలా వరకు కాంట్రవర్సీగానే కనిపిస్తుంది. కానీ ఆయన ఫ్యాన్స్ కు మాత్రం ఆయన మాటల్లో చాల పరమార్థం కనిపిస్తూ ఉంటుంది. అదే ఆయన్ను కాపాడుతూ వస్తోందని చెప్పుకోవాలి. ఆర్జీవీ ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్. ఎంతోమందిని గొప్ప డైరెక్టర్లుగా తీర్చి దిద్దిన ఘనత ఆయన సొంతం.
అలాంటి ఆర్జీవీ ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన డైరెక్టర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు దర్శకులకు ఇప్పుడు పెద్దగా ధైర్యం లేదు. రాజమౌళి, సుకుమార్ లాంటి వారు స్టార్ హీరోలు, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారితోనే సినిమాలు చేస్తారు.
అంతే తప్ప ఓ చిన్న హీరోతోనే, లేదంటే బ్యాక్ గ్రౌండ్ లేని వారితోనే సినిమాలు చేసే ధైర్యం చేయరు. ఎందుకంటే అది వారి సేఫ్ జోన్. నా దృష్టిలో పూరీ జగన్నాథ్ లాగా ఎవడూ సినిమాలు చేయడు. ఎందుకంటే చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే వివక్ష లేకుండా సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ పూరీ మాత్రమే.
మనం పెద్ద హీరోలతో సినిమా చేస్తే అది ఆటోమేటిక్ గా పెద్ద సినిమా అవుతుంది. కానీ ఓ చిన్న హీరోతో కూడా సినిమా చేసి పెద్ద హిట్ కొట్టినప్పుడే మనం డైరెక్టర్లుగా నిరూపించుకున్నట్టు. ఈ విషయంలో రాజమౌళి లాంటి వారు ఇంకా మారాల్సి ఉంది.
అఫ్ కోర్స్ ఆయన మీద ఉండే ప్రెషర్ వల్ల ఆయన స్టార్ హీరోలతో చేస్తున్నారు. అందులో తప్పులేదు. కానీ అందరితో చేసినప్పుడే ఆయన దర్శకుడిగా సక్సెస్ అవుతాడని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.
Read Also : Anushka Shetty : ఆ హీరోతో లిప్ లాక్ ఇష్టంలేదు.. బలవంతంగా చేయించారుః అనుష్క శెట్టి
Read Also : Anjali : అవును.. ముంబై హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇస్తారు.. అంజలి షాకింగ్ కామెంట్లు..!