Dates Sentiment : జనరల్‌గా సినిమా వాళ్లకు నిజ జీవితంలో సెంటిమెంట్స్ ఉండవని కొందరు అంటుంటారు. కానీ, సాధారణ ప్రజానీకం కంటే కూడా సినిమా వాళ్లే పలు విషయాల్లో సెంటిమెంట్స్ కలిగి ఉంటారని సినీ ప్రముఖులు చాలా సార్లు నిరూపించారు. ఆనాటి నుంచి అనగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఈనాటి వరకు అనగా చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వరకు సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు సెంటిమెంట్స్ కలిగి ఉంటున్నారు.
Dates Sentiment
తమ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సినీ ప్రముఖుల మధ్య ముహుర్తం చూసుకుని నిర్వహిస్తుంటారు. అలా పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల బ్లెస్సింగ్స్‌తో సినిమా షూటింగ్ చేయడం వల్ల తమ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందని మేకర్స్ నమ్మకం. ఈ సంగతులు పక్కనబెడితే.. తెలుగు చిత్ర సీమలో ముహుర్తపు సెంటిమెంట్సే కాదు.. తేదీల సెంటిమెంట్ కూడా ఉంది. ఆయా తేదీల్లో లేదా ఆ నెలలో సినిమాలు విడుదల చేస్తే కనుక కచ్చితంగా రికార్డులు తిరగరాస్తాయని మేకర్స్ భావిస్తుంటారట. ఆ తేదీలు ఏంటేంటో తెలుసుకుందాం.
1977 ఏప్రిల్ 28వ తేదీ.. ఈ రోజున నటరత్న ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. ట్రెండ్ సృష్టించింది. అప్పటి వరకు తెలుగు సినిమాలో అంత వసూళ్లు రాలేదట. ఆ కాలంలోనే ఆ సినిమాకు రూ.4 కోట్లపైన వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆ తర్వాత కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌గా మారిపోయారు.
Dates Sentiment1
ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. ‘అడవి రాముడు’ సినిమా ఎన్టీఆర్, కె.రాఘవేంద్రరావుల కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోయింది. ఇకపోతే ఇదే నెలలో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘యమలీల’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో కమెడియన్ ఆలీ హీరో కాగా, చిన్న చిత్రంగా విడుదలైన సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే కొందరు దర్శకులు, నిర్మాతలు ఏప్రిల్ నెలలోనే సినిమాలు విడుదల చేయాలని భావిస్తారట. తద్వారా తమ సినిమాలు ‘అడవి రాముడు, యమలీల’ అంతటి ఘన విజయాలను సాధించాలని భావిస్తారు.
Dates Sentiment 3
ఏప్రిల్ నెలలోనే విడుదలై ఫ్లాప్ అయిన సినిమాలూ ఉన్నాయి. అయినప్పటికీ కొందరు ఏప్రిల్ మంత్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ ఏప్రిల్ నెలలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు – డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పోకిరి’ ఫిల్మ్ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- రాజమౌళిల ‘బాహుబలి’ చిత్రం కూడా ఏప్రిల్‌లోనే విడుదలై..ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.