Ram Charan And Upasana Konidela : మెగా వారసురాలు వచ్చేసింది. ఈ రోజు రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు జన్మించింది. ఈ రోజు ఉదయం జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, కూతుర్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. దాంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది.
పెళ్లి అయిన పదేండ్లకు వీరికి పాప జన్మించింది. ఇన్ని రోజులు వీరు కావాలనే పిల్లల్ని కనలేదు. తాము లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఇన్నేండ్ల వెయిటింగ్ తర్వాత మనవరాలు రావడంతో చిరు దంపతులు కూడా సంతోషంలో ఉన్నారు.
Daughter Was Born Ram Charan And Upasana Konidela Couple
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రామ్ చరణ్ దంపతులుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాప ఫొటోలు రిలీవ్ కాలేదు. మరికొద్ది సేపట్లో ఈ విషయంపై పూర్తి అప్ డేట్ రానుంది. ఇక మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
Read Also : Actress Raasi : ఒంటరిగా బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ రాశి కామెంట్లు..!