Intinti Gruhalakshmi 21 Oct Today Episode : లాస్యకు ఘోరమైన అవమానం.. ఆ విషయమై ఆలోచించి కళ్లు తిరిగి పడిపోయిన తులసి.. చివరకు..

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’కి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ టెలికాస్ట్ అయే టైమ్ దగ్గరపడుతుంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతారు. ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గురువారం హైలైట్స్ ఏంటంటే.. Intinti Gruhalakshmi 21 Oct Today Episode : శోభనం అనగానే కంగారుపడిపోయిన ప్రేమ్, శృతి.. శృతి, ప్రేమ్ పెళ్లి జరిగిందని సంతోషపడుతుంటారు. ఈ క్రమంలోనే […].

By: jyothi

Published Date - Thu - 21 October 21

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : లాస్యకు ఘోరమైన అవమానం.. ఆ విషయమై ఆలోచించి కళ్లు తిరిగి పడిపోయిన తులసి.. చివరకు..

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’కి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ టెలికాస్ట్ అయే టైమ్ దగ్గరపడుతుంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతారు. ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గురువారం హైలైట్స్ ఏంటంటే..

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : శోభనం అనగానే కంగారుపడిపోయిన ప్రేమ్, శృతి..

శృతి, ప్రేమ్ పెళ్లి జరిగిందని సంతోషపడుతుంటారు. ఈ క్రమంలోనే తన తల్లికి బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రేమ్ అనుకుంటాడు. ఈ విషయమై లాస్య, తులసి మధ్య మాటల ఘర్షణ కూడా జరుగుతుంది. ఇకపోతే ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ గురించి సలహా ఇవ్వాలని పరందామయ్య అంటాడు. ఈ నేపథ్యంలోనే అక్కడకు వచ్చిన తులసిని ‘ఏంటమ్మా.. తులసి ప్రేమ్, శృతి పెళ్లి చేశావు.. కానీ, వారి ముచ్చట్లు తీర్చే బాధ్యత నీకు లేదా’ అని అంటాడు.

వారి శోభనానికి సుముహుర్తం పెట్టించాలని సలహా ఇస్తాడు. అయితే, ఈ క్రమంలోనే శృతిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడాలని అంకిత ప్రయత్నిస్తోంది. అయితే, అంకితకు సరైన ఆన్సర్ ఇచ్చి ఆమె నోరు మూయిస్తాడు పరందామయ్య. ఇకపోతే నవదంపతులు ప్రేమ్, శృతి మధ్య సరసాల పర్వం షురూ అయింది. ఓ గదిలో నిద్రిస్తున్నట్లు నటిస్తున్న ప్రేమ్ దగ్గరకు కాఫీ పట్టుకుని వెళ్తుంది శృతి. అలా గదిలోకి కాఫీ పట్టుకుని వెళ్లగానే వారిద్దరు ఒకింత కంగారు పడుతూనే మరో వైపున ఆ క్షణాలను ఆస్వాదించేట్లుగా కనబడుతారు.

tulasi with eyes falling back-2

tulasi with eyes falling back-2

అలా వీరి సరసాలు కొనసాగుతుండగానే.. మరో వైపున పూజారి శోభన ముహుర్తం చూస్తుంటాడు. ఈ క్రమంలోనే తనకు టైం లేదంటూ నందు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, తులసి వారిస్తుంది. అప్పుడు లాస్య కలగజేసుకుని అన్ని నందును అడిగి చేస్తున్నారా? అని ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో జరిగినవన్నీ మర్చిపోవాలని అంటుంది తులసి. మొత్తంగా శోభన ముహుర్తం ఖరారవుతుంది.

అయితే, నందు కంపెనీకి సంబంధించిన ఓ ప్రాజెక్టు విషయమై పలువురు తులసి ఇంటికి వస్తారు. ఆ టైంలో లాస్య తులసిని రూ.రెండు కోట్లు ఇవ్వాలని అడుగుతుంది. నందు పరువుపోతుందని చెప్తూనే, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు అని తులసిని అంటుంది. ఆ సమయంలో ప్రాజెక్టు విషయమై వచ్చిన కంపెనీ ప్రతినిధులు తులసిని ఎవరు ఆవిడ అని అడుగుతారు. అప్పుడు లాస్య నందు మాజీ భార్య అని చెప్తుంది. అయితే, అంతలోనే అసలు మీరెవరు? అని లాస్యను ప్రశ్నిస్తారు.

అలా లాస్యకు ఘోరమైన అవమానం జరుగుతుంది. మొత్తంగా ఇంట్లోనే మాజీ, కాబోయే భార్యలు ఉన్నారేంటనే ప్రశ్నలు వారికి తలెత్తుతాయి. ఈ క్రమంలోనే నందు కోసం శశికళ వస్తుంది. ప్రాజెక్టు విషయమై గొడవ జరుగుతుంది. ఇవన్ని పరిణామాలు అనగా ప్రేమ్ పెళ్లి, రెండు కోట్ల రూపాయలు అప్పలు, శశికళ ఎంట్రీతో తులసి బాగా టెన్షన్ పడుతుంది. అలా వాటి గురించి ఆలోచిస్తూనే అటు ఇటు తిరుగుతూ కళ్లు తిరిగిపడిపోతుంది తులసి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Tags

Latest News

Related News