Ranveer Singh And Deepika Padukone : సినిమా అంటే చాలా సీన్లు ఉంటాయి. అందులో ముద్దు సీన్ల దగ్గరి నుంచి మొదలు పెడితే బెడ్ రూమ్ సీన్ల దాకా నటించాల్సి ఉంటుంది. ఇలా అన్నింటికీ రెడీ అయితేనే సినిమా స్టార్లుగా రాణిస్తుంటారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే.. సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లలో హీరో, హీరోయిన్లు ఎలా కంట్రోల్ అవుతారనేది.
కాగా ఓ సినిమాలో హీరో, హీరోయిన్ నిజంగానే రెచ్చిపోయారు. టెంప్ట్ అయిపోయి నిజంగానే ముద్దు పెట్టేసుకున్నారంట. ఈ విషయాలను సదరు హీరో రణ్ వీర్ సింగ్ తెలిపారు. నేను, దీపికా పదుకొణె కలిసి నటించిన మూవీ రామ్ లీలా. అప్పటికే మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం. కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది.
అయితే రామ్ లీలా సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ మా ఇద్దరి నడుమ ఓ లిప్ కిస్ ప్లాన్ చేశారు. అయితే ఆ సీన్ లో మేమిద్దరం నిజంగానే టెంప్ట్ అయిపోయాం. సీన్ అయిపోయినా కూడా మేమిద్దరం ఆపకుండా అలాగే ముద్దు పెట్టుకున్నాం. దాంతో డైరెక్టర్ చెబుతున్నా సరే మేం వినిపించుకోలేదు.
అలాగే లిప్ లాక్ చేసుకున్నాం అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు రణ్ వీర్ సింగ్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన చేసిన కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.