Deepika Padukone : దీపికా పదుకొణె ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలను తగ్గించట్లేదు. పెళ్లికి ముందు నుంచే ఆమె బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా అటు హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాల్లో నటించింది. అయితే ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదు.
ఎన్నో అవమానాలు ఎదుర్కుంది. ఈ విషయాలను గతంలోనే చెప్పింది దీపికా పదుకొణె. ఇక తాజాగా ఆమె ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లో నటించాలంటే ట్యాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదని నాకు మొదట తెలియదు. అందుకే సినిమాల ఛాన్సుల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను.
ఓ డైరెక్టర్ అయితే నాతో అసభ్యకరంగా మాట్లాడాడు. నువ్వు చూడటానికి పెద్ద అందంగా లేవు. కాస్త నల్లగా ఉన్నావు. నీ ఎద భాగాలు కూడా నల్లగా ఉంటే ఎవరూ చూడరు. ఒకసారి వాటిని ఎక్స్ పోజింగ్ చేసి చూపెట్టు అంటూ దారుణంగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చేసి అతన్ని తిట్టేశాను.
ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ అతన్ని ఇప్పటి వరకు కలవలేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎలాగైనా స్టార్ హీరోయిన్ అవ్వాలని. అనుకున్నది సాధించేందుకు నా ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్లాను. ఇప్పుడు అందరూ నన్ను పొగుడుతుటే చాలా హ్యీపీగా ఉంది అంటూ తెలిపింది దీపికా.
Read Also : Ram Charan And Upasana Konidela : మెగా వారసురాలి రాక.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..!
Read Also : Niharika Konidela : ఆ హీరో వీపుపై ఎక్కాలని ఉంది.. నిహారిక ఏంటీ మాటలు.. అందుకే విడాకులు అంటూ…!