Samyuktha Menon : ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు సంయుక్త మీనన్.. ఈమెను ప్రజెంట్ గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈమె టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుండి చేస్తున్న ప్రతీ సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈమెకు టాలీవుడ్ లో ఒక్క ప్లాప్ కూడా పడలేదు.. హిట్ లేని హీరోలకు సైతం ఈమె మంచి హిట్ ఇస్తుంది.
ఈమె వరుస హిట్స్ అందుకోవడంతో సంయుక్త మీనన్ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించిన ఈ అమ్మడు వరుస హిట్స్ అందుకుంటూనే ఉంది.. ఆ తర్వాత వరుసగా చేసిన బింబిసారా, సార్ సూపర్ హిట్స్ అయ్యాయి. సార్ సినిమాతో సంయుక్త తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇక విరూపాక్ష సినిమాతో ఈ అమ్మడు మరింత ఆకట్టు కోవడమే కాకుండా గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. సాయి తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఇప్పటికి కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకుని రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా ఈమె ఆస్తుల వివరాలు తాజాగా వైరల్ అవుతున్నాయి.. ఈమె మలయాళ బ్యూటీ కావడంతో పుట్టిన ఊరిలో విలాసవంతమైన బంగ్లా ఉందట.. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట.. అంతేకాదు ఈమె దగ్గర 80 లక్షల విలువ చేసే బెంజ్ కారు కూడా ఉందని సమాచారం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమె నిలదొక్కుకోవడమే కాకుండా 10 కోట్లకు పైగానే ఆస్తులను కూడబెట్టిందని టాక్..
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన దర్శకుడు ఎవరో తెలుసా..?
Read Also : Tamannaah Bhatia : అతనికి మాత్రమే లిప్ లాక్ ఇస్తా.. ఆ నటుడిపై తమన్నా మోజు..!