Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కృష్ణ తనయుడిగా మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఆయన అగ్ర స్థానంలో ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో చేస్తున్న ఆయన.. దాని తర్వాత తన డ్రీమ్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి పని చేయబోతున్నాడు.
అయితే ఆయన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబుకు సూపర్ స్టార్ కృష్ణ నుంచి భారీగా ఆస్తులు వచ్చాయి. దాంతో పాటు ఆయన కూడా సినిమాల ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. వాటి మొత్తం విలువ దాదాపు రూ.630 కోట్లు ఉంటుంది.
ఆయనకు జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు ఉంది. దీని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే బెంగుళూరులో కూడా కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. వాటితో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రూ.3కోట్ల విలువ చేసే లంబోర్గిని కారు, రూ.90 లక్షల విలువ చేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్, రూ.49లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఆయన మార్కెట్, రెమ్యునరేషన్ అమాంతం పెరిగే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఆయన ఆస్తులు కూడా భారీగా పెరుగుతాయనే చెప్పుకోవాలి.
Read Also : Uday kiran : ఉదయ్ కిరణ్ ను సినిమా నుంచి తీసేయాలని చూసిన రామోజీరావు.. చివరకు..!
Read Also : Mrunal Thakur : ఇక నా వల్ల కాదు.. ఆ పని ఎప్పుడు చేద్దాం.. సమంతను ఓపెన్ గా అడిగిన మృణాల్..!