Devath Nov 25 Today Episode : రుక్మిణిని చూసి షాకైన దేవుడమ్మ.. ఆదిత్య మాటలకు ఏడుస్తూ..

Devath Nov 25 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్ వీవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో రోజురోజుకూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవుతోంది ఈ సీరియల్. మరి ఈ రోజు (నవంబర్ 25, 2021) న టెలికాస్ట్ అయ్యే విశేషాలు తెలుసుకుందామా? రాధ దగ్గరికి వెళ్లిన మాధవ్.. సన్మాన కార్యక్రమానికి రావాలని కోరుతాడు. సన్మానం చేసేది దేవి.. అందుకు నేనుందుకు సారు అని బదులిస్తుంది రాధ. దీంతో మాధవ్ […].

By: jyothi

Updated On - Thu - 25 November 21

Devath Nov 25 Today Episode : రుక్మిణిని చూసి షాకైన దేవుడమ్మ.. ఆదిత్య మాటలకు ఏడుస్తూ..

Devath Nov 25 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్ వీవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో రోజురోజుకూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవుతోంది ఈ సీరియల్. మరి ఈ రోజు (నవంబర్ 25, 2021) న టెలికాస్ట్ అయ్యే విశేషాలు తెలుసుకుందామా?


రాధ దగ్గరికి వెళ్లిన మాధవ్.. సన్మాన కార్యక్రమానికి రావాలని కోరుతాడు. సన్మానం చేసేది దేవి.. అందుకు నేనుందుకు సారు అని బదులిస్తుంది రాధ. దీంతో మాధవ్ కలుగజేసుకుని దేవి కోసమైనా రావొచ్చ కదా.. నువ్వు కూడా ఉండాలంటూ దేవి కోరుకుంటుందిగా.. అని చెబుతాడు. నా కూతురు నా భర్తకు సన్మానం చేస్తుంటే నాకు మాత్రం చూడాలని ఉండదా.. అంటూ మనసులో అనుకుని.. సన్మానానికి వస్తానంటూ మాధవ్ కు చెబుతుంది రాధ. తర్వాత అందరూ కలిసి సభ వద్దకు చేరుకుంటారు. అప్పుడే అక్కడికి కారులో ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. ఆయనతో పాటు దేవడమ్మ సైతం అక్కడికి వస్తారు.


ఇక వారిద్దరూ అక్కడి వారితో మాట్లాడుతూ రాధను చూస్తారు. రాధను చూస్తూ రుక్మిణి అని నమ్మకం కలుగజేసుకుని షకా్ అవుతుంది దేవుడమ్మ. ఆమె షాక్ అవడాన్ని చూస్తుంది రాధ. ఇక అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అయితే వెనకాల నుంచి రాధను దేవుడమ్మ ఫాలో అవుతూనే ఉంటుంది. దీంతో రాధలాగే చీర కట్టుకుని ఉన్న మరో మహిళను చూసిన దేవుడమ్మ కాస్త వెనక్కి వెళ్లి ఆగుతుంది.. కానీ, రక్మిణీని వెతకడం మాత్రం ఆపదు.

Devath Nov 25 Today Episode

Devath Nov 25 Today Episode

తర్వాత ఆదిత్యకు దేవి దండవేసి సన్మానిస్తుంది. దీనిని దూరం నుంచి చూస్తూ సంబరపడుతుంది రాధ. అనంతరం రాధ ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఉన్నట్టుండి తప్పించుకుపోయిందని అనుకుంటుంది రమ్య. ఇదే విషయాన్ని మాధవ్ తో చెబుతుంది. దీంతో రాధ కోసం అతనూ వెతుకుతుంటాడు. ఇక సన్మాన సభలో రాధను ఆకాశానికి ఎత్తుతాడు ఆదిత్య. నాకేమైనా పర్వాలేదని.. నా చుట్టు ఉన్న వారంతా బాగుండాలని అనుకునే వారు చాలా తక్కువ అని చెబుతాడు ఆదిత్య.


నా జీవితంలోనూ అలాంటి దేవత ఉందని నేను ఇలా ఉండాలని ఆమె కోరుకుందని అంటాడు. ఆమె ఎక్కుడున్నా ఈ సన్మానాన్ని చూస్తూనే ఉంటుందని, ఆ సన్మానం, అభినందనలకు ఆమెకే చెందుతాయని అంటాడు ఆదిత్య. ఆ టైంలో ఎమోషన్ అయిన రాధ.. ఏడుస్తుంది. ఆ తర్వాత ఆదిత్య గురించి దేవి గొప్పగా మాట్లాడుతుంది.

Tags

Latest News

Related News